E-Paper
Advertisement

Sukumar: RC17 అనౌన్స్‌మెంట్ వస్తుందనుకుంటే.. కేవలం విశెస్ మాత్రమేనా సుక్కు?

Sukumar: RC17 అనౌన్స్‌మెంట్ వస్తుందనుకుంటే.. కేవలం విశెస్ మాత్రమేనా సుక్కు?
Advertisement

Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పుట్టినరోజు సందర్భంగా క్రియేటివ్ జీనియస్ దర్శకుడు సుకుమార్ (Director Sukumar) పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘మనం కలిసి సృష్టించిన దానికంటే (రంగస్థలం), రాబోయే ప్రాజెక్ట్ కోసం ఇంకా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను’ అంటూ సుకుమార్ చెప్పడంతో ఫ్యాన్స్ యమా ఖుషి అవుతున్నారు. వాస్తవానికి ఈ బర్త్‌డేకు సుకుమార్ కూడా మంచి ట్రీట్ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ భావించారు. కానీ, కేవలం విశెస్‌తోనే సుకుమార్ సరిపెట్టారు. మొన్నటి వరకు రామ్ చరణ్ బర్త్‌డే రోజు సుకుమార్‌తో చేయబోతున్న సినిమా అనౌన్స్‌మెంట్ ఉండబోతుందనేలా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అనౌన్స్‌మెంట్ ఏం రాలేదు కానీ, ‘రంగస్థలం’ (Rangasthalam) సెట్స్‌లో తనని రామ్ చరణ్ సైకిల్ ఎక్కించుకుని తీసుకెళ్లడం, అలాగే తను సైకిల్ తొక్కుతుంటే రామ్ చరణ్ వెనుక కూర్చోని ఉన్న వీడియోని.. సుక్కు తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశారు.

Also Read- Allu Arjun: శ్రీరామ నవమి..ఆ వ్యక్తికి అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్…ఎంత బాగుందో!

అనౌన్స్‌మెంట్ ఎప్పుడు?

Advertisement

ఇక ఈ వీడియో చూసిన వారంతా థ్యాంక్స్ చెబుతూనే.. ఇది కాదు మాకు కావాల్సింది. అనౌన్స్‌మెంట్ ఎప్పుడు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే, ఈ సినిమా గురించి దర్శకధీరుడు రాజమౌళి అలాంటి అంచనాలు పెంచేశారు. ఇందులో చరణ్ ఇంట్రడక్షన్ సీన్ గురించి రాజమౌళి ఆ మధ్య ఎలా స్పందించారో తెలియంది కాదు. అందుకే, ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందా? అని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వేచి చూస్తున్నారు. అందులోనూ రామ్ చరణ్‌లోని నుంచి అద్భుతమైన నటుడిని బయటకు తీసిన దర్శకుడాయన. అందుకే ఫ్యాన్స్ అంతగా కోరుకుంటున్నారు. త్వరలోనే ఒక భారీ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందనేది మాత్రం సుక్కు చేసిన పోస్ట్ స్పష్టం చేస్తుంది.

Also Read- Sreemaha Vishnu: ఆ టైటిల్ ఏంటి? ఆ పోస్టర్ ఏంటి? అసలేంటీ ఛండాలం?

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో RC17

Advertisement

‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, చరణ్ ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త లుక్‌లో కనిపిస్తారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుందని అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ‘సుక్కూ సార్.. కేవలం విశెస్ చెబితే సరిపోదు, మాకు అప్‌డేట్ కావాలి’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ బర్త్‌డే రోజున సుకుమార్ ఇచ్చిన ఈ చిన్న హింట్, రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద పెద్ద సునామీకి సూచన అన్నట్లుగా ఉందని అంతా భావిస్తున్నారు.

">

Also Read- Anil Ravipudi: వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ నిర్మాతలెవరో తెలుసా?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×