E-Paper
Advertisement

Vishwambhara: మళ్లీ నిరాశ పరిచినా ‘విశ్వంభర’ టీమ్.. ‘పెద్ది’నే కారణమా?

Vishwambhara: మళ్లీ నిరాశ పరిచినా ‘విశ్వంభర’ టీమ్.. ‘పెద్ది’నే కారణమా?
Advertisement

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, విఎఫ్ఎక్స్ కారణంగా వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ, అసలు విడుదల అవుతుందా? అనే అనుమానాల వరకు వచ్చింది. లాస్ట్ ఇయర్ ‘గేమ్ ఛేంజర్’ స్థానంలో విడుదల కావాల్సిన సినిమా, ఇంకా థియేటర్లలోకి రాలేదంటే, ఇలాంటి అనుమానాలు రావడం సహజమే. ఆ సినిమా తర్వాత అనుకుని, షూటింగ్ చేసిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం ఈ సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. సుమారు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి, చిరంజీవి కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డుని క్రియేట్ చేసింది. మరి ఎక్కడ లోపం అంటే, మల్లిడి వశిష్ట పరిస్థితి ‘పద్మవ్యూహంలో అడుగు పెట్టిన అభిమన్యుడి మాదిరి తయారైంది’ అని చెప్పుకోవచ్చు.

Also Read- Nani Fan: నాని కోసం తిరుపతి నుండి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర.. చివరికి!

వశిష్ట టాలెంట్ ఉన్న దర్శకుడే.. కానీ,

Advertisement

ఒక స్టార్ హీరోతో సినిమా అంటే, ప్లానింగ్ ఇంపార్టెంట్. దీనికి అనిల్ రావిపూడినే తీసుకుంటే, ఆయన ప్లానింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అనుభవం వశిష్టకు కరువైంది. చిరంజీవి వంటి హీరో ఉన్నా, విఎఫ్‌ఎక్స్ విషయంలో అంతా చూసుకోవాల్సింది దర్శకుడే. ‘బింబిసార’ వంటి సక్సెస్ తర్వాత వశిష్టకు ఇలాంటి అవకాశం రావడంతో, అంతా ఆశ్చర్యపోయారు. నిజంగా వశిష్ట టాలెంట్ ఉన్న దర్శకుడే. అది ‘బింబిసార’తోనే నిరూపించుకున్నారు. కాకపోతే, భారీ రేంజ్ బడ్జెట్‌ కావడంతో, ఆయన కూడా అతిగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడేమో అనేలా కూడా వార్తలు వస్తున్నాయి. అంతేనా, షూటింగ్ సమయంలో కూడా ఈగో ఇష్యూస్ నడిచినట్లుగా ఇటీవల చోటా కె నాయుడు మాటల్ని బట్టి అర్థమవుతోంది. కాబట్టి, ఇలాంటి ప్రాజెక్ట్ నుంచి బయటపడటం వశిష్టకు అంత ఈజీ అయితే కాదు.

Also Read- Anil Ravipudi: వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ నిర్మాతలెవరో తెలుసా?

శ్రీరామనవమికి మిస్సయ్యారు

Advertisement

ఏదో ఒకటి చేసి ముందు సినిమాను విడుదల చేయాలి. ఈ లోపు కాస్త ప్రమోషనల్ కంటెంట్ దించుతుంటే, సినిమా లైన్‌లో ఉన్నట్లుగా అందరికీ అర్థమవుతుంది. అదేం లేకుండా, రోజులు వెళ్లిపోతున్నాయి కదా అని ఊరుకుంటే, బడ్జెట్ మోపెడు అవుతుంది. అప్పుడు కూడా అంతా వశిష్టనే అంటారు. ఈ సినిమాకు సంబంధించి ‘రామ రామ’ అనే సాంగ్ ఒకటి వచ్చింది. ఈ సాంగ్‌కి సంబంధించి ఏదైనా ప్రోమో, లేదంటే, చిన్న గ్లింప్స్ ఏదైనా, ఈ శ్రీరామనవమికి వదిలి ఉండాల్సింది. ఎందుకంటే, ఇందులో హనుమంతుడి నేపథ్యం ఉన్నట్లుగా.. వచ్చిన స్టిల్స్ తెలియజేశాయి. అలాంటిదేమీ జరగలేదు. ప్రస్తుతం సినిమా ట్రైలర్‌ని విడుదల చేసే ప్లాన్‌లో టీమ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ శ్రీరామనవమికే ఏదైనా వదలాలని చూశారంట కానీ, రామ్ చరణ్ బర్త్‌డే కావడం, ‘పెద్ది’ (Peddi Movie) గ్లింప్స్ వస్తుండటంతో డైవర్ట్ చేయకూడదని చివరి నిమిషంలో ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. ఏదిఏమైనా, ముందు ప్రమోషనల్ కంటెంట్‌ని వదిలితేనే.. ‘విశ్వంభర’పై కాస్త ఆశలు చిగురిస్తాయి. అలా లేదంటే, ఇలాంటి వార్తలే పదే పదే దర్శనమిస్తుంటాయి.

Also Read- Chiranjeevi: శ్రీరామనవమి, చరణ్ బర్త్‌డే.. చిరు ఏం చేశారో చూశారా? వీడియో వైరల్!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×