E-Paper
Advertisement

Globe Trotter: జక్కన్న ప్లాన్ మొత్తం లీక్ .. గ్లోబ్ ట్రాటర్ వీడియో లీక్ చేసిన సుమ!

Globe Trotter: జక్కన్న ప్లాన్ మొత్తం లీక్ .. గ్లోబ్ ట్రాటర్ వీడియో లీక్ చేసిన సుమ!
Advertisement

Globe Trotter: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం రేపు జరగబోయే గ్రాండ్ ఈవెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు (Mahesh Babu),రాజమౌళి(Rajamouli) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాకు సంబంధించి గ్లోబ్ ట్రాటర్(Glob Trotter) ఈవెంట్ ఎంతో ఘనంగా రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం నవంబర్ 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎప్పుడు ఏం జరగాలి ఎలా జరగాలి అనే విషయాల గురించి రాజమౌళి చిత్ర బృందంతో పాటు ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరిస్తున్న వారితో కూడా చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.

లెక్చరర్ గా మారిపోయిన జక్కన్న..

ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం గత 15 రోజులుగా రాజమౌళి ఎంతో కష్టపడుతున్నారు. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియోని యాంకర్ సుమ కనకాల(Suma Kanakal)ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాల విషయంలో జక్కన్న డెడికేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే ఈవెంట్ కోసం ఆయన ఏకంగా మాస్టారులాగా మారిపోయి చిత్ర బృందానికి పెద్ద ఎత్తున క్లాస్ తీసుకున్నారని స్పష్టమవుతుంది. ఏకంగా ఒక బోర్డుపై ఈ వెంట్ కు సంబంధించిన అన్నింటిని రాస్తూ వివరిస్తుండగా మిగతా చిత్ర బృందం ఎంతో శ్రద్ధగా వాటిని వింటున్నారు. ఇక ఈ వీడియోని సుమా కనకాల షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

గ్లోబ్ ట్రాటర్ తుఫాన్…

Advertisement

ఇక ఈ వీడియో పై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. లెక్చరర్ గా మారిపోయిన జక్కన్న .. క్లాసులో అందరూ గుడ్ స్టూడెంట్స్ ఒక్క సుమా తప్ప అంటూ ఈ వీడియో పై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోని షేర్ చేసిన సుమ చలికాలంతోపాటు గ్లోబ్ ట్రాటర్ తుఫాను కూడా రాబోతోంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇలా ఈ వీడియో చూసిన అభిమానులు సినిమాల పట్ల రాజమౌళికి ఉన్న డెడికేషన్ గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. ఒక ఈవెంట్ కోసం ఈ రేంజ్ లో కష్టపడటం అంటే మామూలు విషయం కాదు.

Advertisement

సినిమాలపై ఎంతో ఇష్టం ప్రేమ ఉంటేనే అది సాధ్యమవుతుందని అభిమానులు స్పందిస్తున్నారు. ఇక ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం మహేష్ బాబు అభిమానులు కూడా ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబుకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ పాటు, టైటిల్ రివిల్ చేయనున్నారు అలాగే ఒక గ్లింప్ వీడియో కూడా విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ కార్యక్రమం జియో హాట్ స్టార్ లో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Malaika Arora: పెళ్లికి ముందే డేట్ చెయ్యండి… బోల్డ్ కామెంట్స్ చేసిన నటి!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×