E-Paper
Advertisement

Akhanda 2 : న్యూటన్ చచ్చి బతికిపోయాడు, ఇదెక్కడి ఫిజిక్స్ బోయా

Akhanda 2 : న్యూటన్ చచ్చి బతికిపోయాడు, ఇదెక్కడి ఫిజిక్స్ బోయా
Advertisement

Akhanda 2 : ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పైన ఎప్పటికీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండటం అనేది సహజంగా జరుగుతుంది. అటువంటి కాంబినేషన్స్ లో బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ ఒకటి. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి చేసిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి అఖండ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో క్లారిటీ బోయపాటి శ్రీనుకి బాగా ఉంది.

ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తమన్ కూడా ఈ సినిమా కోసం విపరీతమైన డ్యూటీ చేస్తున్నాడు. బోయపాటి శ్రీను విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. రొటీన్ గా కొన్ని షాట్స్ అన్ని సినిమాల్లో ఇరికిస్తూ ఉంటాడు.

బోయపాటి రొటీన్ 

Advertisement

కంప్లీట్ గా వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్యాక్ చేస్తున్నాడు. అయితే బోయపాటి శ్రీను విషయాల్లో కొన్ని కంప్లైంట్స్ కూడా ఉంటాయి. చూపించిన షాట్స్ నే పదేపది రిపీట్ చేస్తూ ఉంటాడు. ఈ క్లోజ్ షాట్స్ నుంచి బోయపాటి ఇక బయటపడరా అని అనుమానాలు వస్తూనే ఉంటాయి కొంతమంది ప్రేక్షకులకు.

క్లోజ్ షాట్ పెట్టి… ఓ ఫ్యాన్‌తో వెంట్రుకలు ఊగేలా చేయడం… బోయపాటి అన్నీ సినిమాల్లో చాలా ఎక్కువ సార్లు పెడుతున్నాడు. ఇప్పుడు అఖండ 2లో సాంగ్ లో కూడా ఆ షాట్స్ ఉన్నాయి.అంత మంచు ప్రాంతంలో,గాలికి ఒంటిపై ఉన్న బుడిద ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుందా ? నార్మల్ ఫిజిక్స్‌లో అలా జరగదు,బోయపాటి రాసుకున్న ఓన్ ఫిజిక్స్‌లోనే సాధ్యమవుతుంది. ఇటువంటి కామెంట్స్ బోయపాటి సినిమా రిలీజ్ అవుతున్న ప్రతిసారి వినిపిస్తూనే ఉంటాయి.

న్యూటన్ చచ్చి బతికిపోయాడు

Advertisement

న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతానికి కొన్ని వ్యతిరేక పనులు చేస్తూ ఉంటాడు బోయపాటి శ్రీను. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో చరణ్ తల నరుకుతాడు, అప్పుడే ఆకాశంలో తిరుగుతున్న కొన్ని గద్దలు వచ్చి ఆ తలలను ఆకాశంలోకి తీసుకెళ్ళిపోతాయి. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి ప్రకారం ఆ తలలు కింద పడిపోవాలి. కానీ బోయపాటి తాటి ప్రకారం అవి అలా పైకి వెళ్ళిపోతాయి.

న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి అనేది విశ్వంలోని రెండు వస్తువుల మధ్య ఆకర్షణ శక్తి. ఈ శక్తి వాటి ద్రవ్యరాశుల లబ్ధానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది మరియు వాటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. దీనికంటూ ఒక ప్రత్యేకమైన సూత్రం కూడా ఉంటుంది.

కానీ బోయపాటి ఫిజిక్స్ మాత్రం వెండితెర పైన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హీరో ఒక గుద్దు గుద్దుతే విలను గాలిలో తేలుతుంటారు. మామూలుగా కథలో ఎమోషన్ ఆ హై వలన ఎక్కువగా ప్రేక్షకులు పట్టించుకోరు గాని. బోయపాటి శ్రీను సినిమాల్లో అసలు లాజిక్సే ఉండవు. నమ్మశక్యం కానివి కూడా నమ్మేలా చూపించడం అతనికి సాధ్యం. అందుకే అప్పుడప్పుడు న్యూటన్ చచ్చి బతికిపోయాడు. కానీ ఇప్పటికీ ఉండుంటే బోయపాటి థింగ్స్ చూసి మళ్ళీ చచ్చిపోయేవాడు అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి.

Also Read: Sai Dharam Tej : అసలు ఆ సినిమాని లెక్క చేయడం లేదు, ఎన్టీఆర్ మాదిరిగానే సాయితేజ్

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×