E-Paper
Advertisement

Chandni Chaudhary: రాహుల్ రవీంద్రన్ తో అలాంటి సీన్స్ చేయమన్నారు, డైరెక్టర్ షాకింగ్ డెసిషన్?

Chandni Chaudhary: రాహుల్ రవీంద్రన్ తో అలాంటి సీన్స్ చేయమన్నారు, డైరెక్టర్ షాకింగ్ డెసిషన్?
Advertisement

Chandini Chowdary Comments on Raul Ravindran: ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడటం అనేది మామూలు విషయం కాదు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టిన చాందిని చౌదరి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో మొదట కనిపించింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలు చేసింది. మొత్తానికి ఫణీంద్ర నరిశెట్టి దర్శకుడిగా పరిచయమైన మనో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన రేంజ్ సక్సెస్ సాధించలేదు.

రాహుల్ తో అలాంటి సీన్స్

Advertisement

అదే రోజు కేరాఫ్ కంచరపాలెం సినిమా కూడా విడుదలైంది. ఆ సినిమాకి చాలామంది సెలబ్రిటీలు కూడా మంచి పాజిటివ్ టాక్ ఇవ్వడంతో ఆ సినిమా మంచి పేరు సాధించింది. అయితే మను సినిమాకి సపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆ తరువాత హీరోయిన్ గాని సినిమాలు చేయడం మొదలుపెట్టింది. చాందిని చౌదరి వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో, రాహుల్ రవీంద్రన్ , చాందిని చౌదరి కలిసి ‘హౌరా బ్రిడ్జి’ అనే సినిమాలో నటించారు. అప్పటికే అర్జున్ రెడ్డి రిలీజ్ అయి పెద్ద సక్సెస్ అయిపోయింది. అర్జున్ రెడ్డి ప్రభావం వలన హౌరా బ్రిడ్జి సినిమాలో మేకౌట్ సీన్స్, అలానే కిస్ సీన్స్ పెడదామని దర్శక నిర్మాతలు అనుకున్నారట.

అభ్యంతరం చెప్పిన దర్శకుడు

కథ చెప్పినప్పుడు చాందిని కు అవి చెప్పలేదు. సినిమా మధ్యలో అలా చెప్పినందుకు చాందిని చాలా భయపడిపోయింది. చుట్టూ ఉన్న కొంతమంది పెద్దవాళ్లు వచ్చి కూడా సినిమా ఫెయిల్ అయితే నువ్వే బాధ్యత అంటూ బెదిరించడం మొదలుపెట్టారు. చాందిని చౌదరి చాలా ఇబ్బంది పడిపోయింది ఆ సీన్స్ చేయడానికి. అదే తరుణంలో రాహుల్ రవీంద్రన్ కి చెప్తే, ఆ అమ్మాయికి ఓకేనా అని అడిగారట? ఆ అమ్మాయిది ఏముంది సార్ ఎలాగోలా చేద్దాం అని ఆ దర్శక నిర్మాతలు చెబితే. ఆ అమ్మాయికి ఓకే అయినా నాకు ఓకే కాదు అని చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా చాందిని చౌదరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Advertisement

Also Read: Babu Mohan: పోలీస్ అవ్వాలకున్నా.. జంబలకిడిపంబ మూవీతో ఆ కల నెరవేరింది..

వీడియో వైరల్

అయితే చాందిని చౌదరి చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి కారణం ఏంటంటే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్‘ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ సాధించింది. ఈ సినిమా పైన విపరీతమైన ప్రశంసలు ఇచ్చే వాళ్ళు ఎలా ఉన్నారో, అలానే ట్రోల్ చేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే సినిమా అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి చున్నీ తీసి మాట్లాడటం అనేది విపరీతంగా వైరల్ అయింది. అలానే ఆ అమ్మాయికి రాహుల్ హాగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలో రాహుల్ సపోర్టర్స్ ఆయన అలాంటి వారు కాదని, తన క్యారెక్టర్ ఇలాంటిదిని చెబుతూ చాలామంది చాందిని చౌదరి గతంతో చేసిన ఈ కామెంట్స్ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

Related News

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

Big Stories

Advertisement
×