E-Paper
Advertisement

HBD Sumanth: సుమంత్ బర్త్ డే సర్ప్రైజ్.. మహేంద్రగిరి వారాహి నుంచీ స్పెషల్ గ్లింప్స్!

HBD Sumanth: సుమంత్ బర్త్ డే సర్ప్రైజ్.. మహేంద్రగిరి వారాహి నుంచీ స్పెషల్ గ్లింప్స్!
Advertisement

HBD Sumanth: ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అక్కినేని హీరో సుమంత్ (Sumanth) కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రీఎంట్రీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. అందులో భాగంగానే చివరిగా ఈటీవీ విన్ ఓటీటీలో నేరుగా విడుదల చేసిన ‘అనగనగా’ తో సక్సెస్ బాట పట్టిన సుమంత్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈరోజు సుమంత్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ నుంచి స్పెషల్ గ్లింప్స్ ను పంచుకున్నారు చిత్ర బృందం.

మహేంద్రగిరి వారాహి నుండి స్పెషల్ వీడియో..

సుమంత్ హీరోగా.. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. రాజశ్యామల బ్యానర్ పై మధు కాలిపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఒక వీడియోను విడుదల చేసింది. ఈరోజు సుమంత్ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ విడుదల చేసిన ఈ స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాశీ పట్టణాన్ని చూపిస్తూ చివరిలో అమ్మవారు రూపం కళ్ళు తెరిచినట్టుగా ఉన్న ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సూపర్ నేచురల్ కథతో వస్తున్న ఈ మహేంద్రగిరి వారాహి కోసం ఒక భిన్నమైన సరికొత్త పాత్రను హీరో సుమంత్ కోసం డైరెక్టర్ డిజైన్ చేశారని అటు చిత్ర బృందం కూడా చెప్పుకొచ్చింది. ఇకపోతే మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ స్పెషల్ గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

న్యూటన్స్ థర్డ్ లా.. విభిన్నమైన జానర్లలో సుమంత్..

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు హీరో సుమంత్ నటిస్తున్న మరో చిత్రం న్యూటన్స్ థర్డ్ లా.. రాజేష్ కర్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సుమంత్ తో పాటు త్రినాథ్ వర్మ, నేహా , రవి వర్మ, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను ఈటీవీ విన్ నిర్మిస్తోంది. ఇక ఈరోజు ఆయన పుట్టిన రోజు కావడంతో ఫిబ్రవరి 9న ఈటీవీ విన్ ఒక స్పెషల్ పోస్టు పంచుకుంది. అందులో ఒక ఆఫీసులో టేబుల్ వెనకాల కుర్చీలో కూర్చున్నాడు సుమంత్ . కళ్ళకు అద్దాలతో సీరియస్ గా చూస్తున్నాడు. ఈ పోస్టర్ను పంచుకుంటూనే “ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. ఇది చాలా బలంగా తాకబోతోంది. నూటన్స్ థర్డ్ లా థ్రిల్ రైడ్ కి రెడీ అవ్వండి” అంటూ నిన్న సాయంత్రం ప్రీ యాక్షన్ వీడియోని కూడా పంచుకుంది. మొత్తానికైతే ఇప్పుడు రెండు బడా ప్రాజెక్టులతో విభిన్నమైన జానర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సుమంత్ కి ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.

 

Advertisement

ALSO READ:Mrunal Thakur: మృణాల్ పై పువ్వుల వర్షం కురిపించిన సిద్ధాంత్.. రూమర్స్ నిజం చేస్తూ!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×