E-Paper

నలుగురు మొనగాళ్లు.. ఒకే సీజన్… 2027 సమ్మర్ వార్ లో నిలిచేదెవరు?

నలుగురు మొనగాళ్లు.. ఒకే సీజన్…  2027 సమ్మర్ వార్ లో నిలిచేదెవరు?
Advertisement

Summer Clash:‘‘సీజన్‌లందు సమ్మర్ సీజన్ వేరయా’ అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు పరిస్థితి. రెండు నెలల హాలీడేస్‌ని టార్గెట్ చేస్తూ పెద్ద సినిమాలన్నీ క్యూ కట్టేవి. కానీ గత కొన్నేళ్లుగా సమ్మర్ సీజన్ కాస్తా డ్రై సీజన్‌గా మారిన పరిస్థితి. సినిమాలను కోట్లు పెట్టి తీస్తున్నా ప్లాన్ చేసినట్టుగా సమ్మర్‌కు వదలడంలో మేకర్స్ దారుణంగా ఫెయిల్ అవుతున్నారు.

వాలకం చూస్తుంటే ఈ 2026 సమ్మర్ కూడా పెద్ద ప్రాజెక్ట్స్ లేకుండా చిన్న, మీడియం రేంజ్ సినిమాలతోనే సర్దుకుపోయేలా కనిపిస్తుంది. కానీ వచ్చే ఏడాది అంటే 2027 సమ్మర్ మాత్రం ఇప్పటి నుంచే ఫుల్ హీట్ ఎక్కేలా కనిపిస్తుంది. అవును… ఒకటి రెండు కాదు, ఏకంగా దాదాపు నాలుగు బడా ప్రాజెక్ట్స్ సమ్మర్‌లో రిలీజ్‌కు సిద్ధమవడం ఇక్కడ విశేషం. ఒకసారి బాక్సాఫీస్‌పై ఎటాక్ చేయబోతున్న ఆ సినిమాలని చూస్తే…

Advertisement

‘వారణాసి’తో పండగ చేసుకోబోతున్న ఏప్రిల్

సాధారణంగా రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు, మిగతా హీరోలు ఆ దరిదాపుల్లోకి కూడా రావాలంటే ఆలోచిస్తారు. ఎందుకంటే ఆయన సినిమా సృష్టించే విధ్వంసం ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. ఇక మహేష్ బాబుతో తాను తీస్తున్న ‘వారణాసి’ను ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు కూడా.

Advertisement

అయితే ఇప్పటిదాకా రాజమౌళి ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన సినిమాలు వాయిదాల పాట పాడినవి ఎన్నో. కానీ ఈసారి షూటింగ్ స్పీడ్ చూస్తుంటే డేట్ మారేలా లేదు. అంటే ఏప్రిల్ నెల టోటల్‌గా ‘వారణాసి’తో దద్దరిల్లబోతుందన్న మాట.

‘స్పిరిట్’తో మొదలయ్యే మార్చ్

ఇక ఇదే సమ్మర్ సీజన్‌లో మొదటగా ఎంట్రీ ఇస్తానంటూ రెడీ అయిపోయాడు డార్లింగ్ ప్రభాస్. అవును సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ మార్చి 5న రిలీజ్ అవుతుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇక వంగా మార్క్ వయోలెన్స్‌కు ప్రభాస్ క్రేజ్ తోడైతే బాక్సాఫీస్ ఎలా షేక్ అవుతుందో చెప్పక్కర్లేదు. అయితే అన్నట్టుగానే మార్చిలోనే ప్రభాస్ వస్తే మాత్రం ఆ తర్వాత నెలలోనే వచ్చే రాజమౌళి ‘వారణాసి’తో ఫైట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఆసక్తికరం. ముఖ్యంగా ఈ రెండు పెద్ద సినిమాలు థియేటర్లను ఎలా షేర్ చేసుకుంటాయా అన్న క్యూరియాసిటీ ట్రేడ్ వర్గాల్లో బలంగా కనిపిస్తుంది.

‘డ్రాగన్’ జూన్‌లో ‘శుభం’ కార్డు పడుతుందా?

ఇక సమ్మర్ సీజన్ ముగింపులో అసలు సిసలు మాస్ జాతర చూపిస్తానంటూ రెడీ అయిపోయాడు తారక్. ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (అభిమానులు పిలుచుకుంటున్న పేరు)ను జూన్ 11న రిలీజ్ చేస్తామంటూ తాజాగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే సమ్మర్ ఎండింగ్‌లో ఈ రేంజ్ సినిమా వస్తే సెలవులు అయిపోయే లోపు జనాలు ఎంతవరకు ఆదరిస్తారన్నదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. అయినా సరే, నీల్ మార్క్ ఎలివేషన్ల కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారన్నది కాదనలేని సత్యం.

చిచ్చు పెడుతున్న ‘రాకా’

ఇక వీటి సంగతి ఇలా ఉంటే వీటికి తోడుగా బన్నీ – అట్లీ కాంబోలో వస్తున్న ‘రాకా’ కూడా సమ్మర్ బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. ఒకవేళ ఏప్రిల్ లేదా మే నెలలో ‘రాకా’ ఎంట్రీ ఇస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద టాప్ హీరోల వార్ మహా రంజుగా ఉండటం ఖాయం.

ఎందుకంటే ప్రభాస్, రాజమౌళి, ఎన్టీఆర్, బన్నీ… ఈ నలుగురు పెద్ద స్టార్లు మూడు నెలల గ్యాప్‌లో వస్తే ఏ సినిమాకైనా కనీసం రెండు వారాలు కూడా థియేటర్లలో ఉండే ఛాన్స్ ఉండదు. అలా ఒక సినిమా కలెక్షన్స్‌ను మరో సినిమా దెబ్బకొట్టి చివరికి ఏ సినిమా కూడా సాలిడ్ వసూళ్లను చూడక నష్టాల పాలయ్యే ప్రమాదమే ఎక్కువ.

ఏది ఏమైనా వచ్చే సమ్మర్ సీజన్ ఫుల్ హాట్ హాట్‌గా ఉండటం ఖాయం!

also read :స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్.. ‘పెద్ది’కి అదిరిపోయే గ్లామర్ టచ్!

Related News

ప్రస్తుత పరిస్థితులే నన్ను రాజకీయాల వైపు నడిపించాయి: రాఘవ లారెన్స్

పెళ్లి రోజున కవల పిల్లల మొదటి ఫోటో షేర్ చేసి ఉపాసన ఎమోషనల్..

‘విశ్వంభర’ సమ్మర్ మిస్.. దసరా రేసులోకి మెగాస్టార్? సస్పెన్స్‌లో ఫ్యాన్స్!

‘లగాన్’ 25 ఏళ్ల వేడుక.. సరికొత్త లుక్‌లో సల్మాన్ ఖాన్.. కరీనా, జూహీ చావ్లా సందడి!

ఆ బుల్లితెర నటికి ఆడపిల్ల.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు!

మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు.. ‘దంగల్’ కంటే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకే ఎక్కువ ఆదరణ!

‘కాక్‌టెయిల్ 2’ ఈవెంట్‌లో రష్మికకు రక్షణగా నిలిచిన బాలీవుడ్ నటి.. అసలు ఏం జరిగిందంటే?

ప్రతిభావంతులైన విద్యార్థులకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సత్కారం..

×