E-Paper
Advertisement

స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్.. ‘పెద్ది’కి అదిరిపోయే గ్లామర్ టచ్!

స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్.. ‘పెద్ది’కి అదిరిపోయే గ్లామర్ టచ్!
Advertisement

Shruti Haasan in peddhi:పెద్దిలో స్పెషల్ సాంగ్ చేసేది వీరే అంటూ గత కొన్ని రోజులుగా పూజా హెగ్డే, మానస వారణాసి, సంయ్తుక్త మీనన్.. ఇలా రోజుకో పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే తాజాగా వీళ్ళెవరూ కాదంటూ మరో పేరు తెరమీదికి వచ్చింది. అవును… పెద్దిలో చరణ్ సరసన మాంచి మాస్ బీట్ కి స్టెప్పులేసేందుకు కోలీవుడ్ బ్యూటీ శృతి హసన్ ఫైనల్ అయిందన్న వార్తలు ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. బట్ మేకర్స్ నుండే కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

ఎవడు సినిమాలో చరణ్ కి జోడీగా

Advertisement

శృతి హసన్ విషయానికి వస్తే 2014లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఎవడు సినిమాలో చరణ్ కి జోడీగా నటించిన సంగతి తెల్సిందే. దాదాపు 16 ఏళ్ల తర్వాత మరోసారి ఒకే ఫ్రేమ్ లో ఈ జోడీని, అది కూడా మాంచి మాస్ నంబర్ లో చూడటం అంటే మెగా ఫ్యాన్స్ కి మంచి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఇక ఈ స్పెషల్ ఐటం సాంగ్ కోసం శ్రుతికి భారీస్థాయిలో రెమ్యూనరేషన్ ముట్టజెప్పబోతున్నారట. మొత్తానికి ఈ ఒక్క సాంగ్ కోసమే కోట్లల్లో ఖర్చు పెట్టడం చూస్తుంటే సాంగ్ పై మైత్రి మూవీ మేకర్స్ ఎన్ని హోప్స్ పెట్టుకున్నారో అర్థం అవుతుంది.

గురువు బాటలో శిష్యుడు 

Advertisement

ఇక సినిమాలో సాంగ్స్ విషయంలో డైరెక్టర్ బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని, అందులో భాగంగా ఇప్పటికే 3 పాటల ట్యూన్స్ లాక్ అయ్యాయని, వాటిలో ఈ స్పెషల్ సాంగ్ ముఖ్యంగా థియేటర్లను దద్దరిల్లేలా చేస్తుందని ఇన్ సైడ్ టాక్.ఐటం.. అదే స్పెషల్ సాంగ్ అంటే సుక్కు సినిమాలో ఎంత స్పెషల్ గా ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా చరణ్ తో చేసిన రంగస్థలంలో జిగేల్ రాణి అంటూ పూజా బెబీ ఓ రేంజ్ లో అదరగొట్టింది. సో ఇపుడు సుక్కు శిష్యుడు బుచ్చిబాబు కూడా పెద్దిలో ఊర మాస్ సాంగ్ ని సాలిడ్ గా ప్లాన్ చేశాడన్న మాట.

దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఏఆర్ రెహమాన్

ఇక సినిమా విషయానికి వస్తే ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ సినిమా కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్ ను, లుక్ ను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ సెన్సేషన్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు కీ రోల్స్ పోషించనున్నారు. ఇక దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఏఆర్ రెహమాన్ డైరెక్ట్ తెలుగు సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటం ఇక్కడ విశేషం. చూడాలి మరి వినిపిస్తున్నట్టుగా జూన్ 4 లేదా 25న ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేక మరో డేట్ వెతుక్కుంటుందా!

also read:అక్కినేని మల్టీస్టారర్.. సంక్రాంతికి ‘బంగార్రాజు’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Related News

నాగార్జున ఫోన్లో ఒక్క ఫోటో కూడా ఉండదట.. ఎందుకో తెలుసా?

మళ్లీ తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!

అల్లు అర్జున్ భార్య ధరించే హెయిర్ క్లిప్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

Big Stories

Advertisement
×