E-Paper
Advertisement

Sunil: మజాకో మల్లికా.. ఇద్దరు హాట్ గాళ్స్‌తో సునీల్‌కు ఐటమ్.. ఓ ఊపు ఊపేస్తున్నారుగా!

Sunil: మజాకో మల్లికా.. ఇద్దరు హాట్ గాళ్స్‌తో సునీల్‌కు ఐటమ్.. ఓ ఊపు ఊపేస్తున్నారుగా!
Advertisement

Sunil: సునీల్.. ఈ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులకు తెలియంది కాదు. కానీ, ఇప్పుడీ పేరు పాన్ ఇండియ వైడ్‌గా వైరల్ అవుతోంది. కారణం ‘పుష్ప’ (Pushpa) సిరీస్ సినిమాలలో సునీల్ (Sunil) పోషించిన ‘మంగళం శీను’ పాత్రే. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో సునీల్, ఇప్పుడు పాన్ ఇండియా భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనే కాకుండా హిందీలో కూడా సునీల్‌కు అవకాశాలు వస్తున్నాయంటే, ఆయనలో ఉన్న టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆయన ఇద్దరు హాట్ భామలతో డ్యాన్స్ చేస్తున్న సాంగ్ ఒకటి విడుదలై, బాగా వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కాటాలన్’ (Kattalan Movie). ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ సింగిల్‌గా ఐటమ్ సాంగ్‌ని మేకర్స్ వదలడం విశేషమైతే.. ఈ సాంగ్‌లో ఇద్దరు హాట్ హాట్ భామలతో సునీల్ ట్రాక్ ఉండటంతో అంతా బాగా కనెక్ట్ అవుతున్నారు.

Also Read- Kavya Kalyanram: ‘ఎట్ల నడుస్తుంది డేటింగ్ లైఫ్’ అని అంటే.. కావ్య కళ్యాణ్ రామ్ స్పందనిదే..

‘మార్కో’ మేకర్స్ నుంచి వస్తున్న చిత్రం

Advertisement

ఐటెం నంబర్‌గా వచ్చిన ఈ పాటలో సునీల్ హై-ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ఈ ‘మజాకో మల్లికా’ (MAJAKO MALLIKA) అనే ట్రాక్‌కు వినాయక్ శశికుమార్ సాహిత్యం అందించారు. ఆనంద్ శ్రీరాజ్, భద్ర ఆలపించారు. ఈ సాంగ్ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదలైంది. ‘కాటాలన్’ మే 14న భారీ పాన్-ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్లాక్‌బస్టర్ ‘మార్కో’ మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన టీజర్‌‌లో ఉన్న యాక్షన్ సన్నివేశాలు, ఇంతకు ముందు ఎన్నడూ రానీ విధంగా ఆకట్టుకోగా, ఇప్పుడొచ్చిన పాట కూడా అదే స్పందనను రాబట్టుకుంటూ, సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.

Also Read- Patang on OTT: 3 ఓటీటీలలో తెలుగు రోమ్ కామ్ స్ట్రీమింగ్… కంటెంట్ తో కొడుతున్న చిన్న సినిమా

సునీల్ ఈజ్ బ్యాక్

Advertisement

ముఖ్యంగా సునీల్ ఇందులో చాలా కీలక పాత్ర పోషించినట్లుగా ఈ సాంగ్ తెలియజేస్తుంది. ఈ పాట చూస్తుంటే ఇందులో డాన్ తరహా పాత్రలో సునీల్ కనిపిస్తాడనేది అర్థమవుతోంది. చాలా గ్యాప్ తర్వాత సునీల్ ఇలా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. హీరోగా చేయడం మానేసిన తర్వాత సునీల్ డ్యాన్స్ చేయడం ఈ సినిమాలోనే. దీంతో సునీల్ ఈజ్ బ్యాన్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇందులో దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, పుష్ప ఫేమ్ రాజ్ తరందాసు, బాలీవుడ్ నటుడు పార్థ్ తివారీ, మలయాళ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-గాయకుడు హనన్ షా, రాపర్ బేబీ జీన్, హిప్స్టర్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలలో కనిపించనున్నారు. నిర్మాణం పూర్తి కాకముందే, ఈ చిత్రం అనేక ప్రీ-రిలీజ్ రికార్డులను బద్దలు కొట్టిందని, మలయాళ సినిమాల్లో అతిపెద్ద ఓవర్సీస్ డీల్స్‌లో ఒకటిగా నిలిచిందని మేకర్స్ చెబుతున్నారు. మరి విడుదల తర్వాత ఎలాంటి రికార్డులను ఈ సినిమా క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

Also Read- Siddhu Jonnalagadda: ‘కపుల్ ఫ్రెండ్లీ’కి కనెక్టైన స్టార్ బాయ్.. ‘ఎక్స్’ వేదికగా ప్రశంసలు

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×