E-Paper
Advertisement

India Super 8 Matches: వ‌రుస‌గా రెండో ఓట‌మి..ఇంటికే ఆస్ట్రేలియా..టీమిండియా సూప‌ర్ 8 మ్యాచ్ లు ఇవే

India Super 8 Matches: వ‌రుస‌గా రెండో ఓట‌మి..ఇంటికే ఆస్ట్రేలియా..టీమిండియా సూప‌ర్ 8 మ్యాచ్ లు ఇవే
Advertisement

India Super 8 Matches:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament)  నేపథ్యంలో మ్యాచ్ లన్ని చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs Sri Lanka ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన శ్రీలంక, ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాతుమ్ నిస్సంక ( Pathum Nissanka ) సెంచరీతో చెలరేగిన నేపథ్యంలో శ్రీలంక విక్టరీ కొట్టింది. దీంతో ఆస్ట్రేలియా ఓటమి పాలు కాగా, శ్రీలంక మాత్రం సూపర్ 8 లోకి దూసుకు వెళ్ళింది. ఇవాల్టి మ్యాచ్ లో 182 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది ఆస్ట్రేలియా. ఇక ఈ లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలోనే లంక చేదించింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది.

Also Read: IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా

వ‌రుస‌గా రెండో ఓట‌మి..ఇంటికే ఆస్ట్రేలియా ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అద్భుతంగానే రాణించింది. పల్లకేలే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన శ్రీలంక విక్టరీ కొట్టింది. ఇందులో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లు ఆడింది. ఈ సందర్భంగా 181 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో శ్రీలంక కూడా దాటిగానే ఆడింది. పాతుమ్ నిస్సంక ( Pathum Nissanka ) సెంచరీ చేసి చెలరేగాడు. ఈ దెబ్బకు 18 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి మ్యాచ్ గెలిచింది శ్రీలంక. దీంతో సూపర్ 8 లోకి దూసుకు వెళ్ళింది శ్రీలంక. అటు ఆస్ట్రేలియా మాత్రం ఇంటిదారి పట్టే ప్రమాదం పొంచి ఉంది.

శ్రీలంక చేతిలో ఓడిపోయిన ఆస్ట్రేలియాకు సూపర్ 8 ఛాన్సులు సన్నగిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. గ్రూప్ బీలో ఉన్న శ్రీలంక 6 పాయింట్లు సాధించగా, సూపర్ 8లోకి వెళ్ళింది. ఆ తర్వాత జింబాబ్వే రెండో స్థానంలో నాలుగు పాయింట్లతో ఉంది. రన్ రేట్ కూడా అద్భుతంగా ఉంది. ఇటు ఆస్ట్రేలియా మాత్రం మూడవ స్థానంలో నిలిచింది. అంటే ఆస్ట్రేలియాను జింబాబ్వే టెన్షన్ పెడుతోంది. రేపు జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత శ్రీలంకతో కూడా జింబాబ్వే మ్యాచ్ ఉంది. ఈ రెండింటిలో కనీసం ఒక్కటి గెలిచినా, జింబాబ్వే సూపర్ 8కు వెళ్తుంది. అప్పుడు ఆస్ట్రేలియా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ జింబాబ్వే తన తర్వాతి రెండు మ్యాచ్ ల‌లో ఓడిపోతే, ఆస్ట్రేలియాకు కలిసి వస్తుంది. జింబాబ్వే తన తర్వాతి రెండు మ్యాచ్ ల‌లో ఓడిపోవడమే కాకుండా ఒమాన్ తో ఆస్ట్రేలియా భారీ తేడాతో గెలవాలి. అప్పుడే ఆస్ట్రేలియా సూపర్ 8లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇలా జరగకపోతే ఆస్ట్రేలియా ఇంటికి వెళ్లాల్సిందే.

టీమిండియా సూప‌ర్ 8 మ్యాచ్ లు ఇవే

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో డిపెండింగ్ ఛాంపియన్ టీమిండియా సూపర్ 8లోకి దూసుకు వచ్చింది. ఇక తన సూపర్ 8లో ఫిబ్రవరి 22వ తేదీన దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ ఆడాలి టీమిండియా. ఆ తర్వాత ఫిబ్రవరి 26వ తేదీన ఆస్ట్రేలియా లేదా జింబాబ్వేతో టీమిండియా తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరుగుతుంది. దాదాపుగా ఇందులో జింబాబ్వేనే ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మార్చి ఒకటో తేదీన వెస్టిండీస్ తో ఇండియా మ్యాచ్ కోల్కత్తా వేదికగా జరుగుతుంది.

Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్

 

 

Related News

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

Big Stories

Advertisement
×