E-Paper
Advertisement

Patang on OTT: 3 ఓటీటీలలో తెలుగు రోమ్ కామ్ స్ట్రీమింగ్… కంటెంట్ తో కొడుతున్న చిన్న సినిమా

Patang on OTT: 3 ఓటీటీలలో తెలుగు రోమ్ కామ్ స్ట్రీమింగ్… కంటెంట్ తో కొడుతున్న చిన్న సినిమా
Advertisement

Patang on OTT : గతేడాది క్రిస్మస్‌ కానుకగా విడుదలైన ‘పతంగ్‌’ మూవీకి యూత్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక చిన్న బడ్జెట్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఏకంగా 3 ఓటీటీలలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇది వరకే ఇలాంటి స్టోరీలు చాలానే వచ్చాయి. అయితే ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దర్శకుడు స్టోరీని సరికొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. పక్కా హైదరాబాదీ నెటివిటీతో చాలా సహజంగా ఈ కథ సాగుతుంది. ఇక ఈ సినిమా ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ అంటే

వంశీ పూజిత్‌, ప్రణవ్‌ కౌశిక్‌, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పతంగ్’ (Patang) మూవీకి ప్రణీత్‌ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. డి.సురేశ్‌బాబు సమర్పణలో సురేశ్‌ కొత్తింటి, నాని బండ్రెడ్డి దీనిని నిర్మించారు. ఇందులో గౌతమ్‌ మేనన్, ఎస్పీ చరణ్‌ కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇప్పుడు ఏకంగా మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జనవరి 30న సన్ నెక్స్ట్ ఓటీటీలో విడుదలైన పతంగ్‌.. ప్రస్తుతం అమెజాన్‌, ఆహా తెలుగు ఓటీటీలలో కూడా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ చిత్రానికి జోస్ జిమ్మీ సంగీతం అందించారు.

కథలోకి వెళ్తే 

Advertisement

అరుణ్ అనే ఒక డబ్బున్న అబ్బాయితో, హైదరాబాద్‌లోని ఓ బస్తీకి చెందిన విస్కీ ఫ్రెండ్‌షిప్ చేస్తుంటాడు. చిన్ననాటి నుంచి వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికీ గాలిపటాలు ఎగురవేయడం అంటే పిచ్చి. పాతబస్తీ దాదాపు పది ఏళ్ల పాటు గల్లీల్లో కలిసి పెరిగిన వీళ్ళు, గాలిపటాల పోటీల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ ఉంటారు. కానీ ఐశ్వర్య అనే అమ్మాయి వీళ్ళ లైఫ్‌లోకి వచ్చాక అంతా మారిపోతుంది. మొదట ఆ అమ్మాయి విస్కీతో ప్రేమలో పడుతుంది. తర్వాత అరుణ్‌ని కూడా ఇష్టపడుతుంది. ఆ అమ్మాయి వల్ల ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోతారు.

సరిగ్గా అదే టైమ్‌లో గాలిపటాల పెద్ద టోర్నమెంట్ వస్తుంది. ఆ పోటీల్లో గెలవాలన్న కసి ఒక పక్క, దూరమైన తన స్నేహం మిస్ అవుతున్నామన్న బాధ మరో పక్క వాళ్ళని వేధిస్తుంటాయి. మరి ఆ గాలిపటాల పోటీలో వీళ్ళు ఎలా తలపడ్డారు? గాలిపటాల దారం తెగిపోయినట్టు వాళ్ళ స్నేహం కూడా తెగిపోయిందా ? లేక మళ్ళీ ఒకటయ్యారా? అనేదే సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : రిచ్ వరల్డ్ లోకి ఫేక్ అమ్మాయి… కట్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్… ఇంటెన్స్ సస్పెన్స్

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×