E-Paper
Advertisement

Krishna Records: టాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద రికార్డ్..దీన్ని టచ్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా?

Krishna Records: టాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద రికార్డ్..దీన్ని టచ్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా?
Advertisement

Krishna Records: తెలుగు సినిమా అంటేనే రికార్డులు.. రికార్డులంటేనే తెలుగు సినిమా. మొదటి రోజు కలెక్షన్ ఎంత? వంద కోట్లు ఎప్పుడు దాటుతుంది? ఇలాంటి లెక్కలు వేయడం మనకు అలవాటు. కానీ, తెలుగు సినిమా చరిత్రలో ఎందరో మహానుభావులు వచ్చారు.. ఎన్నో రికార్డులు సృష్టించారు. అయితే, ఒకే ఒక రికార్డు మాత్రం దశాబ్దాలు గడుస్తున్నా చెక్కుచెదరకుండా ఉండిపోయింది. ఆ రికార్డును ఎవరూ టచ్ చేయలేరు సరే కదా.. కనీసం ఊహించలేరు కూడా. ఆ అసాధ్యమైన రికార్డును సుసాధ్యం చేసింది మరెవరో కాదు.. సాహసానికి మారుపేరు, మన సూపర్ స్టార్ కృష్ణ.

తెలుగు తెరకు టెక్నాలజీని పరిచయం చేసిన ధీరుడు

రఘుపతి వెంకయ్య నాయుడు, హెచ్.ఎం.రెడ్డి వంటి మహనీయులు వేసిన పునాదిపై టాలీవుడ్ ఇండస్ట్రీని నిర్మించిన వారిలో కృష్ణ పాత్ర అద్వితీయం. నటనలో ఆయన కంటే పెద్దవారు ఉండొచ్చు కానీ, సినిమా అభివృద్ధికి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. పరిశ్రమ నుండి తాను ఎంత సంపాదించాడో.. అంతకు రెట్టింపును మళ్లీ ఇండస్ట్రీ కోసమే ఖర్చు చేశారు. ఈస్టమన్ కలర్, సినిమా స్కోప్, 70 ఎం.ఎం., డీటీఎస్ సౌండ్.. ఇలా సినిమా సాంకేతికతను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.

పాన్ ఇండియా ట్రెండ్‌కు ఆద్యుడు.. ‘కోటి’ రూపాయల సింహాసనం

Advertisement

ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ‘పాన్ ఇండియా’ ట్రెండ్‌ను అప్పట్లోనే సెట్ చేసిన ‘సింహాసనం’ సినిమా కృష్ణ గారి దర్శకత్వంలోనే వచ్చింది. ఇప్పుడు వంద కోట్లు, వెయ్యి కోట్లు అని మాట్లాడుకుంటున్నాం కానీ.. తెలుగులో ఒక కోటి రూపాయల బడ్జెట్ దాటిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఆ రోజుల్లోనే భారీ ఖర్చుతో సినిమా తీసి సంచలనం సృష్టించారు సూపర్ స్టార్.

ఏడాదికి 18 సినిమాలు.. కృష్ణకు పోటీ కృష్ణే

ప్రస్తుత కాలంలో ఒక సినిమా పూర్తి కావాలంటే కనీసం ఏడాది పడుతోంది. ఒక్కో స్టార్ హీరో రెండేళ్లకు ఒక సినిమా తీయడమే కష్టమవుతోంది. కానీ సూపర్ స్టార్ కృష్ణ ఒకే ఏడాదిలో ఎన్ని సినిమాలు విడుదల చేశారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! 1972వ సంవత్సరంలో కృష్ణ గారు ఏకంగా 18 సినిమాలు విడుదల చేశారు. నెలకో సినిమా కంటే ఎక్కువ వేగంతో ఆయన వెండితెరపై మెరిశారు. ఒకే సంవత్సరంలో 10 కంటే ఎక్కువ సినిమాలు విడుదలైన సందర్భాలు ఆయన కెరీర్‌లో కోకొల్లలు.

అన్-బీటబుల్ 317 చిత్రాల రికార్డు

Advertisement

కథానాయకుడిగా 30 ఏళ్ల కెరీర్‌లో 317 చిత్రాల్లో నటించడం అనేది ఒక ప్రపంచ అద్భుతం. కృష్ణ  కెరీర్‌లో కిరీటం లాంటి సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. ఇందులో ఉన్నంత మంది ప్రముఖ నటులు, ఆర్టిస్టులు మరె సినిమాలోనూ ఇంతవరకు లేరు.ఇక  కేవలం సినిమాల సంఖ్యలోనే కాదు, క్వాలిటీలో కూడా ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు కూడా.

 ఆయన ఒక నిత్య విప్లవం

ఎన్ని తరాలు మారినా, ఎంతమంది స్టార్లు వచ్చినా.. కృష్ణ  సృష్టించిన ఈ ‘మాన్ స్టర్’ రికార్డులను అధిగమించడం అసాధ్యం. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.. తెలుగు సినిమాకు ఒక సరికొత్త దిశను చూపించిన అసలైన ‘లెజెండ్’. అందుకే తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుందన్నది అక్షర సత్యం!

also read: భారీ బడ్జెట్ మాయలో..చిన్న సినిమాలకు ఇక నమఃశివాయేనా ?

Related News

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

Big Stories

Advertisement
×