E-Paper
Advertisement

Smartwatches For Kids: ఈ GPS స్మార్ట్‌వాచ్‌లతో.. మీ పిల్లల సేఫ్టీ ఇక సులభం

Smartwatches For Kids: ఈ GPS స్మార్ట్‌వాచ్‌లతో.. మీ పిల్లల సేఫ్టీ ఇక సులభం
Advertisement

Smartwatches For Kids: ఇప్పటి పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లు, వాచ్ లు ఎక్కువగా వాడుతున్నారు. ఇలాంటి టైమ్‌లో కిడ్స్ కోసం స్మార్ట్‌వాచ్ కొనడం ట్రెండ్‌గా మారింది. కాల్ చేయడం, లొకేషన్ ట్రాక్ చేయడం, గేమ్స్ ఆడడం అన్నింటికీ ఒకే డివైస్‌గా ఇవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిల్లల సేఫ్టీ కోసం పేరెంట్స్ ఎక్కువగా స్మార్ట్‌వాచ్‌లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పిల్లలకు సరిపోయే 3 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల గురించి సింపుల్‌గా ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలకు స్మార్ట్‌వాచ్ అంటే కేవలం గాడ్జెట్ మాత్రమే కాదు. ఒక సేఫ్టీ టూల్ కూడా.జీపీఎస్ ట్రాకింగ్, కాలింగ్ ఫీచర్,ఎస్ఓఎస్ అలర్ట్స్ వంటి ఫీచర్స్ వల్ల పేరెంట్స్ పిల్లలపై నిగ్రహం ఉంచగలరు. స్కూల్‌కు వెళ్తున్నప్పుడు లేదా బయట ఆడుతున్నప్పుడు.. పిల్లలు సేఫ్‌గా ఉన్నారో లేదో తెలుసుకోవడం సులభం అవుతుంది.

Advertisement

1. Noise Scout Kids Smartwatch:

నాయిస్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌వాచ్ పిల్లలకు మంచి ఆప్షన్. ఇందులో జీపీఎస్ ట్రాకింగ్, కాలింగ్ ఫీచర్,ఎస్ఓఎస్ బటన్ ఉన్నాయి. దీని ద్వారా పిల్లలు ఎక్కడ ఉన్నారో రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. ఈ వాచ్ డిజైన్ కూడా కలర్‌ఫుల్‌గా ఉండి పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా సరాసరి స్థాయిలో ఉంటుంది. బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ కావాలనుకునే .. పేరెంట్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్.

Advertisement

2. boAt Wanderer Kids Smartwatch:

boAt కంపెనీ నుంచి వచ్చిన Wanderer స్మార్ట్‌వాచ్ కూడా కిడ్స్ కోసం మంచి ఆప్షన్. ఇందులో 4G సిమ్ సపోర్ట్ ఉండటం వల్ల కాల్స్, వీడియో కాల్స్ కూడా చేయొచ్చు. అంతే కాకుండా జీపీఎస్ ట్రాకింగ్, SOS ఫీచర్, వాయిస్ మెసేజ్ ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. పిల్లలతో ఎప్పుడైనా కనెక్ట్‌గా ఉండాలనుకునే.. పేరెంట్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది. డిజైన్ స్టైలిష్‌గా ఉండి పిల్లలకు నచ్చుతుంది.

3. Fire-Boltt Kids Smartwatch:

Fire-Boltt కిడ్స్ స్మార్ట్‌ వాచ్ కూడా బడ్జెట్‌లో మంచి ఫీచర్స్ ఇస్తుంది. ఇందులో కాలింగ్, జీపీఎస్ ట్రాకింగ్, గేమ్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ వాచ్ పిల్లలకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు బేసిక్ సేఫ్టీ కూడా ఇస్తుంది. ధర తక్కువగా ఉండటం వల్ల బడ్జెట్‌లో కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

బెస్ట్ ఫీచర్స్:

పిల్లల కోసం స్మార్ట్‌వాచ్ తీసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ తప్పనిసరిగా చూడాలి.

1. GPS ట్రాకింగ్

2. కాలింగ్ & వీడియో కాలింగ్

3. SOS బటన్

4. బ్యాటరీ లైఫ్

5. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ

ఈ ఫీచర్స్ ఉంటే.. పిల్లలు సేఫ్‌గా ఉండటానికి సహాయ పడతాయి.

పిల్లలకు సేఫ్టీ ఎలా పెరుగుతుంది?

స్మార్ట్‌వాచ్ వల్ల పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లల లొకేషన్ తెలుసుకోవచ్చు. SOS బటన్ ద్వారా ఎమర్జెన్సీ సమయంలో వెంటనే అలర్ట్ పంపవచ్చు. ఇది మొబైల్ ఇవ్వకుండానే పిల్లలతో కనెక్ట్‌ అవడానికి మంచి మార్గం.

Also Read: చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఫ్రిజ్ ..ఈ ధరలో అస్సలు మిస్సవ్వొద్దు

కొనేటప్పుడు జాగ్రత్తలు:

స్మార్ట్‌వాచ్ కొనేటప్పుడు పిల్లల వయస్సు, వాడకం, అవసరాన్ని బట్టి ఎంపిక చేయాలి. చాలా ఫీచర్స్ అవసరం లేకపోతే.. ఈ సింపుల్ మోడల్ సరి పోతుంది. అలాగే బ్యాటరీ లైఫ్ , బిల్డ్ క్వాలిటీ కూడా ముఖ్యమే. పిల్లల కోసం స్మార్ట్‌వాచ్ ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్. సేఫ్టీ, కమ్యూనికేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ వల్ల ఆల్ ఇన్ వన్ డివైస్‌గా ఇది ఉపయోగపడుతుంది.

Noise, boAt, Fire-Boltt వంటి బ్రాండ్స్ నుంచి మంచి ఆప్షన్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్, అవసరాన్ని బట్టి సరైన మోడల్ ఎంచుకుంటే..మంచిది.

 

Related News

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

Big Stories

Advertisement
×