E-Paper
Advertisement

US–NATO Rift: ఇది మా యుద్ధం కాదు!.. అమెరికాకు ముఖం చాటేసిన ఏడు దేశాలు.. ఏం జరగబోతోంది?

US–NATO Rift: ఇది మా యుద్ధం కాదు!.. అమెరికాకు ముఖం చాటేసిన ఏడు దేశాలు.. ఏం జరగబోతోంది?
Advertisement

US–NATO Rift: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. వార్‌తో మొదలైన మంటలు ఇంకా చల్లారడం లేదు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ఎఫెక్ట్ పడుతోంది. ట్రంప్ కూడా దీనిని తిరిగి తెరిపించేందుకు, నౌకా రవాణా యధాతథంగా కొనసాగించేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌లో ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది. ఇందుకు.. నాటో దేశాలే కారణం. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం కంటే ఎక్కువగా.. అమెరికా తన మిత్రదేశాలైన నాటో సభ్యులపై అసహనంగా ఉంది. హర్మూజ్ రక్షణ విషయంలో మిత్రదేశాలు మొహం చాటేయడం ట్రంప్‌కు అస్సలు నచ్చడం లేదు. దాంతో.. అమెరికాకు, నాటో దేశాలకు మధ్య అగాధం పెరుగుతోంది.

ఏడు నాటో దేశాలకు ట్రంప్ పిలుపు

హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో.. అక్కడికి యుద్ధ నౌకలు పంపాలని ఏడు నాటో దేశాలకు ట్రంప్ పిలుపునిచ్చారు. చమురు అవసరాల కోసం ఆ మార్గంపై ఆధారపడే దేశాలే దాని రక్షణ బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలు నిర్మొహమాటంగా నో చెప్పేశాయ్. దాంతో.. తమకు ఎవరిసాయం అక్కర్లేదంటూ ట్రంప్ తేల్చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభంతో.. నాటోలోని మిత్రదేశాలు అమెరికాకు సహకరించేందుకు వెనుకాడుతున్నాయన్నారు. ఇరాన్‌తో యుద్ధానికి ఎవరూ సాయం చేయకపోయినా, అన్ని దేశాలు మద్దతు ఇచ్చాయన్నారు.

హర్మూజ్ రక్షణపై మాక్రాన్ క్లారిటీ.. ట్రంప్ కౌంటర్

Advertisement

యూరప్ రక్షణ కోసం అమెరికా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఉక్రెయిన్ కోసం.. యూఎస్ లక్షల కోట్లు కుమ్మరిస్తోంది. కానీ, తమకు అవసరమైనప్పుడు కనీసం రెండు మైన్ స్వీపర్ షిప్‌లని పంపేందుకు కూడా నాటో దేశాలకు మనసు రావడం లేదని.. ట్రంప్ అసహనంతో రగిలిపోతున్నారు. యుద్ధం తర్నవాత నాటో కూటమి నుంచి అమెరికా తప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే.. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దీనిపై స్పందించారు. హర్మూజ్ జలసంధి రక్షణకు తాము సిద్ధమే కానీ, అది అమెరికా-ఇారన్ యుద్ధంలో భాగంగా ఉండకూడదని స్పష్టం చేశారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. మాక్రాన్ పదవీకాలం త్వరలోనే ముగుస్తుందన్నారు. యూకే ప్రధాని కీర్ స్మార్టర్‌పై ట్రంప్ నిప్పులు చెరిగారు. ఇది తమ యుద్ధం కాదని, తమని ఇందులోకి లాగొద్దని.. ఈయూ కూడా రియాక్ట్ అయింది. ఈ క్రమంలో.. నాటో దేశాల నుంచి సైనికసాయం లభించకపోయినా, ఇరాన్‌ని ఒంటరి చేసేందుకు అమెరికా వ్యూహాలు రచిస్తోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌ని, హిజ్బుల్లాని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించి.. ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలకు అమెరికా రాయబారులతో వర్తమానం పంపింది.

ఇరాన్ భయం.. ఇంధన ధరల ఆందోళన

ప్రెసిడెంట్ ట్రంపే స్వయంగా పిలుపునిచ్చినా.. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు యుద్ధంలోకి దిగడానికి ఇష్టపడట్లేదు. ఇది.. అమెరికా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధమని, నాటో రూల్స్ ప్రకారం.. ఇది ఉమ్మడి రక్షణ పరిధిలోకి రాదనేది యూరోపియన్ దేశాల వాదన. యుద్ధంలోకి నేరుగా దిగితే.. ఇరాన్ తమ నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని, దాంతో.. తమ దేశాల్లో ఇంధన ధరలు మరింత పెరుగుతాయని వారు భయపడుతున్నారు. బాంబులు, మిసైళ్లతో కంటే, దౌత్యపరమైన చర్చల ద్వారానే హర్మూజ్ జలసంధిని తెరిపించాలని.. కొన్ని నాటో దేశాలు భావిస్తున్నాయ్. అయితే.. ఈ విషయంలో అమెరికా వైఖరి పూర్తి భిన్నంగా ఉంది. నాటోని.. ట్రంప్ ఎప్పుడూ ఓ వన్ వే స్ట్రీట్‌గా చెబుతారు. అమెరికా కొన్ని బిలియన్లకొద్దీ డాలర్లు ఖర్చు పెట్టి ఐరోపాను రక్షిస్తుందని, కానీ, అమెరికాకు అవసరమైనప్పుడు ఆ దేశాలు సాయం చేయవనేది.. ఆయన వాదన. తాము ఇరాన్‌ని ఎంతో దెబ్బ తీశామని, తమకు ఎవరి సాయం అక్కర్లేదని అంటున్నారు. కాకపోతే, మిత్ర దేశాలుగా హర్మూజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపాల్సింది అని ట్రంప్ అంటున్నారు.

నాటోపై ట్రంప్ కొత్త ప్రెషర్

Advertisement

ఇప్పటికే, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో.. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు 40 నుంచి 50 శాతం పెరిగాయ్. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు ఆగిపోవడంతో.. భారత్ లాంటి దేశాలపై ప్రభావం పడుతోంది. అయితే.. బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ లాంటి నేతలు.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇది నాటో మిషన్ కాదని స్పష్టం చేశారు. అయితే.. ట్రంప్‌ది ఎప్పుడూ అమెరికా ఫస్ట్ పాలసీ. నాటో దేశాలు అమెరికాకు సాయం చేయకపోతే, భవిష్యత్తులో ఉక్రెయిన్ లాంటి దేశాలకు ఇచ్చే సాయాన్ని నిలిపివేస్తానని, నాటో నుంచి తప్పుకుంటామని బెదిరించే అవకాశాలున్నాయి. ఈ పరిణామాలు.. గ్లోబల్ జియో పాలిటిక్స్ సినారియాలో.. ఈక్వేషన్స్ మార్చేసే ఛాన్స్ ఉంది.

ప్రపంచ పెద్దన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతోందా?

అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న అనే మాట ఉంది. కానీ, అంతర్జాతీయ పరిణామాలు చూస్తుంటే.. అగ్రరాజ్యం అనే మాటకు విలువ తగ్గుతోందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ట్రంప్ వైఖరి వల్లో, లేక ఆయన విధానాల ప్రభావమో తెలియదు గానీ, అమెరికా, నాటో దేశాల మధ్య ఒక రకమైన అగాధం కనిపిస్తోంది. అమెరికా పిలుపుని నాటోలోని మిత్ర దేశాలు ధిక్కరించడమే ఇప్పుడు వరల్డ్ వైడ్ డిబేట్‌కు దారితీసింది. దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాల రక్షణ కవచంగా ఉన్న నాటో.. ఇప్పుడు అనేక సవాళ్లని ఎదుర్కొంటోంది. అమెరికా ఒక మాట చెబితే.. వేదంలా భావించే ఐరోపా దేశాలు.. ఇప్పుడు సొంత దారిని వెతుక్కుంటున్నాయ్. కాస్త లోతుల్లోకి వెళితే.. ఆసక్తికరమైన అంశాలు, అగ్రరాజ్యానికి వీస్తున్న ఎదురుగాలులకు.. అనేక కారణాలు కనిపిస్తున్నాయ్.

ట్రంప్ వ్యాఖ్యలతో మిత్రదేశాల్లో అనుమానాలు

ట్రంప్ మొదట్నుంచీ.. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. మీ రక్షణ కోసం మేము ఖర్చు పెట్టడమేంటి? మీ వాటా మీరు కట్టుకోండని.. ఆయన బాహాటంగా నాటో దేశాలను నిలదీయడం ఐరోపా నాయకులకు నచ్చలేదు. రక్షణ బడ్జెట్ విషయంలో ట్రంప్ చేసిన కఠిన వ్యాఖ్యలు, నాటో నుంచి అమెరికా తప్పుకుంటుందనే బెదిరింపులు.. ఆయా దేశాల్లో అగ్రరాజ్యంపై ఉన్న నమ్మకం సడలిపోయేలా చేశాయ్. అంతేకాదు, అమెరికాపై అతిగా ఆధారపడటం కూడా ప్రమాదకరమేనని ఫ్రాన్స్ లాంటి దేశాలు బలంగా నమ్ముతున్నాయ్. అమెరికాలో ప్రభుత్వం మారినప్పుడల్లా, వారి ప్రాధాన్యతలు మారితే.. తమ పరిస్థితి ఏంటనే ఆందోళన మొదలైంది. అందుకే, అమెరికా మాట వినడం కంటే, యూరోపియన్ డిఫెన్సివ్ ఇనిషియేటివ్ లాంటి సొంత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెడుతున్నారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత, యుద్ధం మొదలయ్యాక.. అమెరికాకు, నాటో మిత్ర పక్షాలకు మధ్య అభిప్రాయభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్.

మిడిల్ ఈస్ట్‌లో కొత్త సంక్షోభానికి భయం

ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడానికే అమెరికా యుద్ధం ప్రారంభించినా.. ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఆ దేశంలో పాలన మార్పు జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే, బ్రిటన్, ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాలు.. ఇరాన్‌లో ప్రభుత్వం పతనమైతే.. మిడిల్‌ఈస్ట్‌లో తలెత్తే శరణార్థుల సమస్య, తీవ్రవాదం లాంటి ప్రభావాలను భరించలేమని భావిస్తున్నాయ్. దాడులు చేసేముందు తమను సంప్రదించలేదని, ఇది అమెరికా తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని యూరోపియన్ దేశాలు అసంతృప్తితో ఉన్నాయ్. హర్మూజ్ జలసంధిలోకి యుద్ధ నౌకలను పంపితే.. నేరుగా ఇరాన్‌తో యుద్ధంలోకి దిగినట్లు అవుతుందనే ఆలోచనతో ఉన్నారు. పైగా.. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని కొన్ని దేశాలు భావిస్తున్నాయ్. కేవలం.. సైనిక బలంతో కాకుండా, దౌత్యపరంగా చర్చలు జరిపి హర్మూజ్‌లో నౌకల రవాణాకు రూట్ క్లియర్ చేయాలని కోరుతున్నారు.

మీ యుద్ధం మీరు చేసుకోండి.. నాటో దేశాల కఠిన వైఖరి

అమెరికా తన భారీ సైనిక సంపత్తితో ఇరాన్‌పై దాడులు చేస్తున్నా.. నాటో దేశాల మద్దతు పూర్తి స్థాయిలో లేదు. యూరోపియన్ దేశాలు ఇప్పటికే, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆర్థికంగా, సైనికంగా అలసిపోయి ఉన్నాయి. మరో కొత్త యుద్ధంలో తలదూర్చడం వారికి ఇష్టం లేదు. ముఖ్యంగా.. నాటో దశాలు తమ రక్షణ కోసం తామే ఖర్చు పెట్టుకోవాలని, అమెరికాపై ఆధారపడొద్దని చేసిన వ్యాఖ్యలు.. నాటో దేశాల మధ్య దూరాన్ని పెంచాయ్. అందుకే, ఇప్పుడు.. మీరు మొదలుపెట్టిన యుద్ధంలో.. మేము ప్రాణాలు ఫణంగా పెట్టలేమనే ధోరణిలో నాటో దేశాలున్నాయ్. యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడం, తమ దేశాల్లోని ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో.. బ్రిటన్ లాంటి దేశాలు అమెరికాకు పరిమిత మద్దతు మాత్రమే ఇస్తున్నాయ్. మరీ ముఖ్యంగా.. మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధం ఇంకొంతకాలం కొనసాగితే.. దాని ప్రభావం శరణార్థుల రూపంలో ఐరోపాపైనే పడుతుంది. అందుకే, ఇరాన్ విషయంలో అమెరికా తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలకు.. నాటో దేశాలు మద్దతివ్వడం లేదు. ఇరాన్‌‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించాలని ఐరోపా భావిస్తోంది. కానీ, అమెరికా ఆంక్షలు అడ్డంకిగా మారుతున్నాయ్. ఏదేమైనా.. ఒకప్పటితో పోలిస్తే.. నాటోపై అమెరికా గుత్తాధిపత్యం తగ్గిందనేది మాత్రం వాస్తవం. ట్రంప్ అనుసరిస్తున్న లావాదేవీల ధోరణ వల్ల.. మిత్రదేశాలు కూడా తమ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నాయ్. అమెరికా తన పంథా మార్చుకోకపోతే నాటో కూటమిలో చీలికకు దారితీసే అవకాశం ఉందంటున్నారు.

Also Read: డిప్యూటీ స్పీకర్ పదవిని కాలదంటున్న ఎమ్మెల్యే.. అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×