E-Paper
Advertisement

Suriya: సూర్యకి అతని తమ్ముడు కార్తీలో నచ్చని విషయం ఏమిటో తెలుసా..?

Suriya: సూర్యకి అతని తమ్ముడు కార్తీలో నచ్చని విషయం ఏమిటో తెలుసా..?
Advertisement

Suriya: తమిళ హీరోలంటే మన తెలుగు వాళ్ళు కూడా సొంతం హీరోల లాగే భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా సూర్యకి.. అతని తమ్ముడు కార్తీకి.. ఇద్దరికీ కూడా తెలుగులో ప్రత్యేకమైన అభిమాన సంఘాలు ఉన్నాయి. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా ఉన్న ఈ అన్నదమ్ములు, తమ సినిమాలు తెలుగులో డబ్బింగ్ కావడంతో ఇక్కడ కూడా భారీ అభిమానులను సంపాదించారు. ముఖ్యంగా కార్తీ ఊపిరి సినిమాతో..నేరుగా తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

సూర్య, కార్తీ ఇద్దరూ కేవలం అన్నదమ్ములే కాదు, మంచి స్నేహితులు కూడా. పబ్లిక్ ఈవెంట్స్‌లో, అవార్డు వేడుకల్లో, ఇంటర్వ్యూలలో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపిస్తుంటారు. కుటుంబానికి ఎంతో విలువ ఇచ్చే వ్యక్తులుగా వీరికి మంచి పేరు ఉంది. అలాంటి వారిద్దరి మధ్య గొడవలుంటాయా అనే సందేహం అభిమానులకు రావడం సహజమే.

Advertisement

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఎంతో పాపులర్ Unstoppable with Nandamuri Balakrishna కార్యక్రమంలో.. కొద్ది రోజుల క్రితం సూర్య అతిథిగా పాల్గొన్నారు. ఆ షోలో హోస్ట్ అయిన Nandamuri Balakrishna సరదాగా, “కార్తీ ఏం చేస్తే మీకు అస్సలు నచ్చదు?” అని ప్రశ్నించారు. దీనికి సూర్య నవ్వుతూ చాలా సింపుల్‌గా సమాధానం చెప్పారు.

కార్తీ తన బట్టలు వేసుకుంటే తనకు కోపం వస్తుందని సూర్య చెప్పారు. అదే విషయం మీద ఇద్దరి మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు జరుగుతాయని సరదాగా వివరించారు. అయితే తను మాత్రం కార్తీ డ్రస్సులు వేసుకుంటూ ఉంటాను అని చెప్పడంతో అక్కడున్నవాళ్లంతా నవ్వులు చిందించారు. ఈ మాటలన్నీ పూర్తిగా సరదాగా చెప్పినవేనని సూర్య చెప్పారు.

Advertisement

ఇవి పెద్ద గొడవలు కాదని, ప్రతి ఇంట్లో అన్నదమ్ముల మధ్య జరిగే సాధారణ చిలిపి విషయాలేనని సూర్య అన్నారు. తమ మధ్య ఎప్పుడూ తీవ్రమైన విభేదాలు లేవని, కుటుంబ బంధమే తమ జీవితంలో అత్యంత ముఖ్యమని చెప్పారు.

ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా తమ తమ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

ALSO READ: Nani: అభిమానికి హ్యాండ్‌షేక్ ఇవ్వడానికి నిరాకరించిన హీరో నాని.. మరి అంత అహమా..!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×