E-Paper
Advertisement

Suriya46 : సమ్మర్ టార్గెట్ పెట్టిన సూర్య, రిలీజ్ ఎప్పుడు అంటే?

Suriya46 : సమ్మర్ టార్గెట్ పెట్టిన సూర్య, రిలీజ్ ఎప్పుడు అంటే?
Advertisement

Suriya46 : నటుడుగా కెరియర్ మొదలు పెట్టిన వెంకీ అట్లూరి తర్వాత కాలంలో రైటర్ గా కూడా మంచి పేరు సాధించుకున్నాడు. ఒకవైపు రైటర్ గా చేస్తూనే మరోవైపు నటుడుగా కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అయితే తనలో రైటర్ కి మాత్రమే తర్వాత కాలంలో ఎక్కువ పని చెప్పాడు. మొత్తానికి తొలిప్రేమ సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు.

వరుణ్ తేజ్ నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించుకుంది. ఆ సినిమాతోనే వెంకీకి దర్శకుడుగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చేసిన మజ్ను, రంగ్ దే సినిమాలు ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. అయితే యాదృచ్ఛికంగా ఈ మూడు సినిమాలు కు సంబంధించి సెకండ్ హాఫ్ అంత లండన్ లో జరుగుతుంది. దీని మీద అప్పట్లో విపరీతమైన ట్రోలింగ్ కూడా వచ్చింది.

సార్ కం బ్యాక్ 

Advertisement

వరుసగా రెండు సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత ధనుష్ హీరోగా సార్ అనే సినిమా అనౌన్స్ చేశాడు వెంకీ. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు లండన్ పై మళ్లీ జోక్స్ వినిపించాయి. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ లో ఇది కూడా ఒక భాగం అయింది.

అసలు వెంకీ అట్లూరి ఇంత గొప్ప సినిమా తీశాడా అని అందరిని ఆశ్చర్యపడేలా చేశాడు. ఆ తర్వాత వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు సూర్య హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.

సమ్మర్ రిలీజ్ ఫిక్స్

Advertisement

చాలామంది ఇతర భాష హీరోలు డైరెక్ట్ గా తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ధనుష్, విజయ్, దుల్కర్ సల్మాన్ వంటి హీరోలు తెలుగు దర్శకులతో చేతులు కలిపి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు సూర్య వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే ఒకటో తారీఖున 2026లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో వెంకీ హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంటాడా అనేది చాలామందికి ఉన్న క్యూరియాసిటీ. సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read: Anchor Suma: ఈవెంట్ మొత్తం భుజంపై మోసింది, ఆఖరికి అతను కూడా హ్యాండ్ ఇచ్చాడు

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×