Anchor Suma: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమాకి సంబంధించి ఈవెంట్ జరిగిన దానికి యాంకర్ గా వ్యవహరిస్తారు సుమ కనకల. ఒక ఈవెంట్ నడిపించడం అనేది మామూలు విషయం కాదు. చూడటానికి మనకి ఆనందంగా ఉన్నా కూడా చాలా సందర్భాలలో సుమ తన కష్టం తెలియకుండా నవ్విస్తూ యాంకర్ చేస్తుంటారు.
రీసెంట్ గా సుమా ఇచ్చిన ఒక పాడ్ కాస్ట్ లో తను యాంకరింగ్ చేసే ఈవెంట్ లో ఉండే ఇబ్బందులను చెప్పారు. అవి విన్న తర్వాత చాలామందికి ఆశ్చర్యం కలిగింది. కొన్ని సందర్భాలలో ట్రైలర్ ఈవెంట్ చేస్తున్నప్పుడు ట్రైలర్ కూడా రెడీగా ఉండదంట. ట్రైలర్ కొన్ని నిమిషాల్లో ప్లే చేయాల్సి ఉంది అనుకునే టైం కి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అయితే ఆ టైం మేనేజ్ చేయడానికి సుమా పడే పాట్లు అన్ని,ఇన్ని కావు.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా 2027 సమ్మర్ లో విడుదల కానుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఒక స్పెషల్ వీడియో కూడా నిన్న జరిగిన ఈవెంట్ లో రాజమౌళి విడుదల చేశారు. ఆ వీడియో చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో అందరికీ ఒక అవగాహన వచ్చింది.
ముఖ్యంగా ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది సుమా కనకల. ఈ ఈవెంట్ లో ఆ స్పెషల్ వీడియో ప్లే అవ్వడానికంటే ముందు కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఆ టైముని సుమా చాలా ఈజీగా కవర్ చేశారు. అక్కడ ఉండే వాళ్లతో మాట్లాడిస్తూ వచ్చిన వాళ్ళందరినీ విసిగిపోకుండా హోల్డ్ చేశారు.
ఆ ట్రైలర్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు సింహాన్ని కూర్చుని పెట్టి సినిమా విశేషాలు అడిగారు. మొత్తానికి రాజమౌళి దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. అలానే దేవుడిపై కూడా కొద్దిపాటి అసంతృప్తిని వ్యక్తం చేశారు రాజమౌళి.
సుమతో పాటు మరో హిందీ యాంకర్ ను ఈ ఈవెంట్ కు హోస్ట్ గా పెట్టారు. కానీ అతను సరిగ్గా ఈవెంట్ మేనేజ్ చేయలేకపోయాడు. కొంతసేపు తర్వాత సుమా కూడా స్టేజ్ మీదే నా పక్కన ఒక కో హోస్ట్ ఉండాలి ఏమైపోయాడు అంటూ మాట్లాడింది. మొత్తానికి అతను కూడా హ్యాండ్ ఇచ్చిన సుమా మాత్రం ఈవెంట్ మొత్తాన్ని ఆశ్చర్యకరంగా పర్ఫెక్ట్ గా హోస్ట్ చేస్తూ ఆడియన్స్ అందర్నీ హోల్డ్ చేశారు. మొత్తానికి ఈవెంట్ సక్సెస్ చేశారు. లైవ్ పక్కన పెడితే అక్కడ ఉన్న ప్రత్యక్షమైన ఆడియన్స్ అందరికీ కూడా సుమా గొప్పతనం ఏంటో అర్థమైంది.
Also Read: Telugu directors: ఈ ముగ్గురు దర్శకులు మామూలు కాదు, స్టార్ హీరోలతోనే అలా చేయించారు