E-Paper
Advertisement

సౌండ్‌ప్రూఫ్ రూమ్‌లో లాక్ చేసి.. సింగర్ పై ప్రముఖ సంగీత దర్శకుడి అఘాయిత్యం!

సౌండ్‌ప్రూఫ్ రూమ్‌లో లాక్ చేసి.. సింగర్ పై ప్రముఖ సంగీత దర్శకుడి అఘాయిత్యం!
Advertisement

Swagata Allegations : కోలీవుడ్ నాట మరో సెక్సువల్ హెరాస్ మెంట్ జరిగిందన్న వార్తలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయ్.యస్.. ‘యెనో పెన్నే’, ‘కాదల్ కన్మణి’ వంటి పాపులర్ సాంగ్స్ పాడి మంచి క్రేజ్ కొట్టేసిన ప్రముఖ గాయని స్వాగత కృష్ణన్ తన లైఫ్ లో ఎదురైన అనుభవాలని ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ క్రమంలోనే తాను ఎలా సెక్సువల్ హెరాస్ మెంట్ కి గురయ్యానో వివరించింది.

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గురువులా

Advertisement

తన లవ్ బ్రేకప్ అయిన సమయంలో ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గురువులా నటిస్తూ తన జీవితంలోకి వచ్చాడని, తన పరిస్థితిని ఆసరాగా తీసుకొని దగ్గరయ్యాడని తెలిపింది.అతని స్టూడియో సౌండ్‌ప్రూఫ్‌గా ఉండేదని, అదే అవకాశంగా తీసుకొని లోపలికి పిలిచి తనపై దారుణంగా  లైంగిక దాడి చేశాడని చెప్పింది.అది మాత్రమే కాకుండా స్టూడియోలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో జరిగిన దాన్ని రికార్డ్ చేసి తనను బ్లాక్ మెయిల్ చేశాడని కూడా ఆరోపించింది.

ALSO READ: గ్లోబల్ స్టార్‌కు బాలీవుడ్ షాక్.. చరణ్‌ను పక్కన పెట్టి ధనుష్‌కు రెడ్ కార్పెట్.. అసలేం జరుగుతోంది?

Advertisement

తన క్యారెక్టర్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో

కేవలం సెక్సువల్ హెరాస్ మెంట్ మాత్రమే కాకుండా తనతో కోరస్ కంపోజిషన్, మిక్సింగ్ వంటి పనులు చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని, పైగా అప్పుల్లో ఉన్నానంటూ తన దగ్గర నుంచే డబ్బులు తీసుకుని మోసం చేశాడని వెల్లడించింది.ఇంకా తన క్యారెక్టర్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో దొంగతనం వంటి తప్పుడు ఆరోపణలు కూడా వేసాడని, వాటి కారణంగా తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కొంతకాలం సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది.ఈ మెంటల్ టెన్షన్ తట్టుకోలేక ఇండస్ట్రీని వదిలి ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ వెళ్లి అక్కడ సొంతంగా బిజినెస్ చేసుకుంటూ జీవితం కొనసాగిస్తున్నానని తెలిపింది.

ఎప్‌స్టీన్ ఆఫ్ మద్రాస్

అయితే తాజాగా అదే వ్యక్తి చేతిలో మరో అమ్మాయి కూడా మోసపోయిందని తెలుసుకుని ఇక మౌనం వహించకూడదని భావించి ఈ విషయాన్ని బయటపెడుతున్నానని చెప్పింది.ఇది వ్యక్తిగత ప్రతీకారం కోసం కాదని, ఇకపై మరెవరూ అతని మాయలో పడకూడదనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చానని స్పష్టం చేసింది.ఇంత పెద్ద ఆరోపణలు చేసినప్పటికీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు బయటపెట్టకుండా కేవలం అతడిని “ఎప్‌స్టీన్ ఆఫ్ మద్రాస్” అని పేర్కొనడం గమనార్హం.

విక్రమ్, లియో వంటి ఎన్నో సినిమాల్లో నటిగా

ప్రస్తుతం తన సోదరి, బిగ్‌బాస్ ఫేమ్ మాయ కృష్ణన్ సపోర్ట్ తో న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది.అయితే ఇండస్ట్రీలో మరో అమ్మాయి బలి కాకుండా మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే కానీ, మిమ్మల్ని అంతగా వేధించిన వ్యక్తి ఎవరో కూడా బయటపెడితే ఇంకా బాగుంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.స్వాగత కృష్ణన్ విషయానికి వస్తే సామ్ సి.ఎస్., జి.వి. ప్రకాష్ కుమార్, సంతోష్ దయానిధి వంటి ప్రముఖ సంగీత దర్శకుల వద్ద ఎన్నో పాటలు పాడి మంచి సింగర్ గా ప్రూవ్ చేసుకోగా,చెల్లి మాయ కృష్ణన్ విక్రమ్, లియో వంటి ఎన్నో సినిమాల్లో నటిగా అలరించింది.ఇక  ‘బిగ్ బాస్ తమిళం సీజన్ 7’లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది కూడా.

చూడాలి మరి ముందుముందు అయినా ఆ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు బయటికి వస్తుందేమో!

ALSO READ :మళ్లీ 90లలోకి తీసుకెళ్తున్న ‘దూరదర్శిని’…మే 15న వస్తున్న హార్ట్ టచింగ్ మూవీ!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×