Xiaomi 17T Series: షావోమి 17T సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లు.. మే నెలలో విడుదల కానున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే విడుదలకు ముందే షావోమి 17టి (Xiaomi 17T), షావోమీ 17టి ప్రో (Xiaomi 17T Pro) మెుబైల్స్ కు సంబంధించిన కొన్ని ఫీచర్లు లీకయ్యాయి. ప్రస్తుతం అవి మెుబైల్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ ప్రీమియం మెుబైల్స్ పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇంతకీ ఆ లీకైన ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
లీకైన సమాచారాన్ని బట్టి చూస్తే.. Xiaomi 17T మెుబైల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 (MediaTek Dimensity 8500) చిప్‌సెట్ ఉండే ఛాన్స్ ఉంది. సాధారణంగా స్నాప్‌డ్రాగన్ వాడే ఈ సిరీస్‌లో దీనిని ఒక కీలకమైన మార్పుగా టెక్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. అలాగే 17T Pro మోడల్‌లో డైమెన్సిటీ 9500 ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
మరోవైపు షావోమి కొత్త ఫోన్లకు సంబంధించిన బ్యాటరీ సమాచారం కూడా బయటకొచ్చింది. 17T మోడల్‌లో 6,500mAh భారీ బ్యాటరీ, ప్రో మోడల్‌లో అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. వీటికి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని సమాచారం.
షావోమీ 17T సిరీస్ మెుబైల్స్.. నాణ్యమైన స్క్రీన్స్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి 6.6 అంగుళాల 1.5K రిజల్యూషన్ కలిగిన OLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే అవకాశమున్నట్లు లీకైన సమాచారన్ని బట్టి తెలుస్తోంది. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3తో ఈ ఫోన్లు పనిచేస్తాయని అంటున్నారు.
షావోమి 17టి ప్రో మోడల్ ప్రధానంగా మూడు ఆకర్షణీయమైన రంగుల్లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆల్ బ్లాక్ (All Black), డీప్ బ్లూ (Deep Blue), డీప్ వయొలెట్ (Deep Violet) రంగుల్లో లాంచ్ కావొచ్చని సమాచారం. 17టి ప్రో వేరియంట్ 12GB ర్యామ్, 512GB + 1TB స్టోరేజ్ వేరియంట్లలో లభించే ఛాన్స్ ఉంది. అటు 17T బేసిక్ మోడల్ 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ స్టోరేజ్ లలో రావొచ్చు.
Also Read: మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్.. HD+ స్క్రీన్, 6,000mAh బ్యాటరీ.. తక్కువ ధరలో ఇన్ని అద్భుత ఫీచర్లా!
కొన్ని టెక్ వెబ్ సైట్ కథనాల ప్రకారం.. షావోమీ తన 17T సిరీస్ మెుబైల్స్ ను మే 29 నుండి జూన్ 30 మధ్య విడుదల చేసే అవకాశముంది. మరోవైపు ధరలు ఎంత ఉండొచ్చన్న దానిపై కూడా టెక్ నిపుణులు ముందే లీక్స్ ఇస్తున్నారు. అమెరికాలో 17T ధర 780-800 డాలర్ల మధ్య ఉండొచ్చని పేర్కొంటున్నారు. భారత్ లో
రూ.69,000-72,000 మధ్య అందుబాటులోకి రావొచ్చని చెబుతున్నారు. మరోవైపు 17T Pro ధర 92,000-9600 మధ్య ఉండొచ్చని లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Also Read: ఏసీ గ్యాస్ లీక్ స్కామ్.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే.. నెక్ట్స్ టార్గెట్ మీరే కావొచ్చు!