Doordarshini Movie : కొన్ని సినిమాలు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తాయ్.మరికొన్ని సినిమాలు మర్చిపోయిన జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. కాని మా సినిమా మాత్రం మీ గుండెల్ని పిండేసి కళ్ళలో నీళ్ళు పెట్టిస్తాయ్ అంటుంది ‘దూరదర్శిని’ సినిమా టీమ్.
మే 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్
వారాహ మూవీ మేకర్స్ పతాకంపై సువిక్షిత్, గీతికా రతన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహిస్తున్నారు.ఇక జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ నిర్మించిన ఈ ‘ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్’ మే 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుండటం విశేషం.ఇక ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘చిత్రలహరి మీట్’లో మూవీ టీమ్ షేర్ చేసుకున్నవిశేషాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
ఒక హృదయ విదారకమైన యదార్థ గాథ
ముఖ్యంగా ఈ సినిమా కథ వెనుక ఉన్న అసలు నిజాన్ని హీరో సువిక్షిత్ రివీల్ చేస్తూ చెప్పిన మాటలు అందరికి షాక్ ఇచ్చాయ్.అరుణాచలంలో తాను గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ వృద్ధుడు అడుక్కుంటూ అడుక్కుంటూ కనిపించాడని, ఆయనతో మాట్లాడినప్పుడు తెలిసిన ఒక హృదయ విదారకమైన యదార్థ గాథే ఈ సినిమా అని చెప్పుకొచ్చాడు సువిక్షిత్.
అసలు ఎందుకు కన్నకొడుకు వల్లే ఒక తండ్రికి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని,ఆయన మానసిక స్థితి అలా ఎందుకు మారిపోయింది? అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుందని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ సినిమా చూసి ఎవరైనా ఏడవకుండా థియేటర్ బయటకు వస్తే వారి లైఫ్‌ను తానే సెటిల్ చేస్తానని ఒక క్రేజీ ఛాలెంజ్ విసరడం ఇక్కడ గమనార్హం.
ALSO READ: 57 ఏళ్ల వయసులో 18 ఏళ్ల చిన్నదానితో ప్రేమాయణం.. ఎవరీ స్టైలిష్ విలన్? వీడియో వైరల్
ప్రేక్షకులకు ఖర్చీఫ్ కూడా ఫ్రీ
“మా సినిమా టికెట్‌తో పాటు ప్రేక్షకులకు ఖర్చీఫ్ కూడా ఫ్రీగా ఇస్తాం, ఎందుకంటే ఎమోషన్‌ను ఆపుకోవడం ఎవరి వల్లా కాదు” అని ఆయన అన్న మాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయనే చెప్పాలి.ఇక దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ, ఇది కేవలం యూత్ కి నచ్చే లవ్ స్టోరీ మాత్రమే కాదని, అటు పేరెంట్స్ కి , ఇటు సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఈ సినిమా ఇస్తుందని తెలిపారు. 90వ దశకంలో జనం ‘చిత్రలహరి’ ప్రోగ్రామ్ కోసం ఎంతలా ఎదురుచూసేవారో, ఆ రోజుల్లోని స్వచ్ఛమైన భావోద్వేగాలు ఎలా ఉండేవో ఈ సినిమాలో చూడవచ్చని చెప్పారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు తమ ‘గోల్డెన్ డేస్’లోకి వెళ్లిపోతారని, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు చూసిన తర్వాత ఆ ఫీల్ నుంచి బయటకు రావడం ఎవరికైనా కష్టమేనని పేర్కొన్నారు.
ఈ చిత్రం ‘మన ఇంటి పెరుగన్నం’
ఇక ప్రముఖ నటుడు జెమిని సురేష్ ఈ చిత్రాన్ని ‘మన ఇంటి పెరుగన్నం’ తో పోల్చడం విశేషం. ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను పల్లెటూరి వాతావరణంలో విహరింపజేస్తుందని, ప్రతి ఒక్కరి మనసు అనే యాంటెన్నాను మే 15న ‘దూరదర్శిని’ వైపు తిప్పాలని ఆయన కోరారు.హీరోయిన్ గీతికా దాస్ మాట్లాడుతూ, ఈ సమ్మర్‌లో ఇది చాలా కూల్ సినిమా అని, ఇలాంటి అరుదైన ప్రేమకథలు టాలీవుడ్ లో చాలా తక్కువగా వస్తాయని చెప్పారు.
మే 15 వరకు వేచి చూడాల్సిందే
ఇక గోదావరి బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ అందమైన కథలో లావణ్య రెడ్డి, కిట్టయ్య, తేజ, బాలరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ‘దూరదర్శిని – కలిపింది ఇద్దరిని’ మూవీ థియేటర్లలో ఏ స్థాయి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఆ వృద్ధుడి కథలో ఉన్న అసలు ట్విస్ట్ ఏంటి? దూరదర్శిని ఒక జంటను ఎలా కలిపింది? అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే మే 15 వరకు వేచి చూడాల్సిందే!
ALSO READ :గ్లోబల్ స్టార్‌కు బాలీవుడ్ షాక్.. చరణ్‌ను పక్కన పెట్టి ధనుష్‌కు రెడ్ కార్పెట్.. అసలేం జరుగుతోంది?