E-Paper
Advertisement

Hyderabad Accident: ఫెరారీ కారు బీభత్సం.. బయటపడ్డ షాకింగ్ విజువల్స్.. చూస్తే వణుకు పుట్టాల్సిందే!

Hyderabad Accident: ఫెరారీ కారు బీభత్సం.. బయటపడ్డ షాకింగ్ విజువల్స్.. చూస్తే వణుకు పుట్టాల్సిందే!
Advertisement

Hyderabad Accident: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఫెరారీ కారు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా బయటకొచ్చాయి. ప్రమాదం జరిగిన తీరును సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ రికార్డు చేసింది. ఈ దృశ్యాలు ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురిచేస్తున్నాయి.

వీడియోలో ఏముందంటే?

ఫిబ్రవరి 22వ తేదీ (ఆదివారం) ఉదయం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న లగ్జరీ స్పోర్ట్స్ కారు.. ఒక్కసారిగా అదుపుతప్పి.. పక్కరోడ్డులోకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ కారును బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో వెనుక వైపు వచ్చిన వాహనాలు సైతం కారును బలంగా ఢీకొట్టింది. సడెన్ బ్రేక్ కారణంగా పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో వీడియో చూడవచ్చు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా.. ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.

Advertisement

భీతావాహ పరిస్థితి..

ప్రమాదం అనంతరం స్థానికంగా భీతావాహ పరిస్థితి తలెత్తినట్లు సీసీటీవీ దృశ్యాలను బట్టి స్పష్టమవుతోంది. ప్రమాదం జరిగిన తీరు చూసి అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ వాహనాల విడిభాగాలు, ధ్వంసమైన కార్లు, గాయపడ్డ వ్యక్తులను చూసి కలవరానికి లోనయ్యారు. వెంటనే తెరుకొని పోలీసులకు సమాధానం ఇచ్చారు. అనంతరం గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Also Read: Upcoming Earbuds 2026 March: JBL నుంచి Apple వరకు.. ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌తో మార్కెట్‌లోకి కొత్త బడ్స్!

ప్రమాదానికి కారణమదేనా?

ప్రమాదానికి కారణమైన వ్యక్తిని నగరానికి చెందిన యువ వ్యాపారి క్రాంతిరెడ్డి (30)గా పోలీసులు గుర్తించారు. ఫెరారీ కారులో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ యాక్సిడెంట్ చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. సమయానికి బ్రేక్స్ సరిగా పనిచేయలేదని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా కారు ఢీకొట్టిన వేగానికి అక్కడే ఉన్న విద్యుత్ స్తంభం సైతం నేలకొరిగింది. ఈ ఘటనలో రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి.

Also Read: Urvasi Rautela: 31వ బర్తడే కి.. 251 మంది అమ్మాయిలకు పెళ్లిళ్ల జరిపిన బాలకృష్ణ హీరోయిన్..!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×