E-Paper
Advertisement

Taapsee Pannu: అప్పుడలా.. ఇప్పుడిలా.. తాప్సీ మాటలు నమ్మడం ఎలా?

Taapsee Pannu: అప్పుడలా.. ఇప్పుడిలా.. తాప్సీ మాటలు నమ్మడం ఎలా?

Taapsee Pannu:ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను(Taapsee pannu) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. అటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అస్సీ.. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా తెలుగులో తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె కొంతకాలంగా తెలుగు పరిశ్రమ పట్ల చేస్తున్న విమర్శలు నెట్టింట వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో చాలా మంది ఈమెపై విమర్శలు కూడా గుప్పించారు.

ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లు మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించాలని ఇక్కడి ఫిలిం మేకర్స్ తనపై ఒత్తిడి తెచ్చేవారు అంటూ ఆరోపించింది. ఇక దాంతో చాలామంది తాప్సిపై విమర్శలు గుప్పించారు. అయితే అలాంటి ఈమె సడన్గా యూటర్న్ తీసుకొని తెలుగు సినీ పరిశ్రమపై ప్రశంసలు కురిపించడంతో అభిమానులు కూడా ఈమెపై విరుచుకుపడుతున్నారు. అప్పుడేమో అలా విమర్శలు గుప్పించి.. ఇప్పుడేమో ఇలా ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు మిమ్మల్ని నమ్మడం ఎలా? అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

విషయంలోకి వెళ్తే.. తెలుగు , తమిళ్ చిత్రాల ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన తాప్సీ.. చష్మే బద్దూర్ అనే హిందీ చిత్రంతో హిందీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పింక్, థప్పడ్ వంటి చిత్రాలతో తనకంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె.. గత కొంతకాలంగా బాలీవుడ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో సౌత్ ఇండస్ట్రీ పై ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ పై విమర్శలు గుప్పించింది. అయితే ఇప్పుడు మళ్లీ తన తాజా చిత్రం అస్సీ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు సినీ పరిశ్రమపై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. ఆమె మాట్లాడుతూ..” తెలుగు సినిమాలో నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే పాత్రలు ఉంటాయి. తెలుగులో మాదిరి తమిళ పరిశ్రమలో అలాంటివి తక్కువగా కనిపిస్తాయి. టాలీవుడ్ నుంచి నాకు మంచి పాత్రలే దక్కాయి. ముఖ్యంగా తెలుగు ప్రజలు నన్ను బాగా ఆదరిస్తారు . నా విలువను పెంచిన సినిమాలన్నీ కూడా తెలుగు నుంచే ఉన్నాయి. నా కెరియర్ కు తెలుగు పరిశ్రమ ఎంతగానో ఉపయోగపడింది అంటూ గుర్తు చేసుకుంది తాప్సి. ఇకపోతే ఇప్పుడు టాలీవుడ్ పై ప్రశంసలు కురిపించడంతో టాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తోందేమో అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తోందని నెటిజెన్స్ ఒక రేంజ్ లో మండిపడుతున్నారు.

also read:Virosh Wedding: విరోష్ పెళ్లి చూడడం నా అదృష్టం.. లేడీ సూపర్ హీరో ఎమోషనల్!

తాప్సీ తెలుగు చిత్రాలు..

మోహన్ బాబు, మంచు మనోజ్ లీడ్రోల్ పోషిస్తూ వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సీ. ఆ తర్వాత షాడో, గేమ్ ఓవర్ ,సాహసం, దరువు , వీర, ఆనందోబ్రహ్మ అంటూ పలు చిత్రాలు చేసిన ఈమె 2022లో మిషన్ ఇంపాజిబుల్ సినిమా చేసి తెలుగు తెరకు దూరమైంది . మళ్లీ ఇప్పుడు ఇలాంటి కామెంట్లు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×