E-Paper
Advertisement

MSVPG: చిరుతో ఐటెంసాంగ్.. ఈసారి కూడా ఆమెనా .. ?

MSVPG: చిరుతో ఐటెంసాంగ్.. ఈసారి కూడా ఆమెనా .. ?
Advertisement

MSVPG: ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం సంక్రాంతి సినిమాలపైనే కన్నేసింది. ఈసారి సంక్రాంతికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో అందరి కన్ను మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమా పైనే ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహుగారపాటి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ వీడియోస్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా చిరుకి భారీ విజయం దక్కింది లేదు. వాల్తేరు వీరయ్య మినహా ఏ చిత్రంతో కూడా అభిమానులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు. గతేడాది  వచ్చిన భోళాశంకర్ అయితే ఎంత పెద్ద షాక్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. దీంతో ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.

Advertisement

అనిల్ రావిపూడి సైతం చిరుకి మంచి కమ్  బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. దీనికోసమే వెంకటేష్ ని కూడా రంగంలోకి దించాడు. ఈ మధ్యనే ఆయన సెట్ లోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చిరు- వెంకీ కలయికలో కొన్ని కీలక సన్నివేశాలను ఫినిష్ చేశారని సమాచారం. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కూడా ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడంట అనిల్.  చిరు -ఐటమ్ సాంగ్ డెడ్లీ కాంబో అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఐటెం సాంగ్ అంటే కచ్చితంగా స్టార్ హీరోయిన్ ను దింపుతారు అని అందరికీ తెలిసిందే. కాకపోతే లాస్ట్ టైం వాల్తేరు వీరయ్య లో ఆల్రెడీ ఊర్వశి రౌతేలా.. చిరు సరసన ఆడిపడింది. ఇక ఇప్పుడు ఏ బ్యూటీ దిగుతుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అనిల్ మాత్రం తనకు అచ్చి వచ్చిన తమన్నానే మరో మారు ఐటెంభామగా దింపుతున్నాడని సమాచారం. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ తో తమన్నా ఆడి పాడిన విషయం తెలిసిందే.  దాంతోపాటు చిరుతో సైరా నరసింహారెడ్డి. భోళా శంకర్ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

Advertisement

ఇక ఇప్పుడు మరోసారి చిరు సరసన ఐటమ్ సాంగ్ లో  మెరుస్తుందని, ఈ సాంగ్ లో వెంకీ కూడా కనిపించనున్నాడట. అయితే ఈ సాంగ్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. అలాంటి సాంగ్ లో  మళ్లీ తమన్నాని అంటే.. చూసి చూసి బోర్ కొట్టిందని, ఎవరైనా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని నెటిజన్స్  సలహా ఇస్తున్నారు.  మరి అనిల్ అభిమానుల సలహాను స్వీకరించి కొత్త హీరోయిన్ ను దింపుతాడేమో చూడాలి.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×