E-Paper
Advertisement

IPL 2026: RCB ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్.. బెంగళూరులో నో ఐపీఎల్!

IPL 2026: RCB ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్.. బెంగళూరులో నో ఐపీఎల్!

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( RCB) ఊహించని ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అమ్మేస్తున్నారన్న వార్త బయటకు రావడంతో చాలా ఆందోళనలో అభిమానులు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ అభిమానులకు మరో షాక్ తగిలింది. బెంగళూరు తొక్కిసలాట నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం జరిగే హోం మ్యాచ్ ల‌ను చిన్నస్వామి స్టేడియంలో ( Chinnaswamy Stadium ) ఆడొద్దని డిసైడ్ అయిందట బెంగళూరు యాజమాన్యం. ఇందుకు బదులుగా మహారాష్ట్రలోని పూణే స్టేడియాన్ని ఎంచుకున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇదే జరిగితే రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు తమ మ్యాచ్ ల‌ను హోమ్ గ్రౌండ్ లో ఆడకపోవడం ఇదే తొలిసారి కాబోతుంది.

Also Read: IPL 2026 Released Players List: 10 ఫ్రాంచైజీలు రిలీజ్ చేసేది ప్లేయ‌ర్లు వీళ్లే..లిస్ట్ లో ర‌షీద్‌, ష‌మీ కూడా?

RCB ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్.. బెంగళూరులో నో ఐపీఎల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పీకల్లోతు కష్టాలు వచ్చి పడ్డాయి. 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచిన బెంగళూరు జట్టు, విజయోత్సవ వేడుకల్లో (rcb stampede deaths) 11 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు నిర్వహించకూడదని యాజమాన్యం ఓ నిర్ణయానికి వచ్చిందట. అంతేకాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును విక్రయించేందుకు డియాగో కంపెనీ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఇప్పటికే ప్రకటన కూడా వెలువడింది. మార్చి 2026 సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ రాబోతున్నాడు. ఈ సమస్య ఇలా ఉండగా.. వచ్చే సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున విరాట్ కోహ్లీ ఆడబోడని సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన అగ్రిమెంట్ పై విరాట్ కోహ్లీ సంతకం పెట్టలేదట. వచ్చే సీజన్ లో ఆడకుండా రిటైర్మెంట్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నారట విరాట్ కోహ్లీ. అందుకే ఇప్పటి వరకు సంతకం చేయలేదని సమాచారం.

RCB కెప్టెన్ కు తీవ్ర గాయం

పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన కెప్టెన్ రజత్ పాటిదార్ కు తీవ్ర గాయం అయింది. దేశవాళి క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న రజత్ పాటిదార్ కు ఇటీవల గాయం కావడంతో నాలుగు నెలల పాటు రెస్టు తీసుకోనున్నాడు. అంటే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభంలో రజత్ పాటిదార్ దూరం అయ్యే ప్రమాదం ఉంది. దీంతో బెంగళూరుకు మళ్ళీ కొత్త కెప్టెన్ రావాల్సి ఉంటుంది. ఇన్ని సమస్యల మధ్య బెంగళూరు జట్టు రాణిస్తుందా? ఎప్పటి లాగే టోర్నమెంట్ లో విఫలమవుతుందా ? అని టెన్షన్ లో RCB అభిమానులు ఉన్నారు.

Also Read: Arshdeep Singh: రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్..మైలేజ్‌, ఫీచ‌ర్స్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×