E-Paper
Advertisement

Sivakarthikeyan : హీరో శివకార్తికేయన కారుకు ప్రమాదం..అసలేం జరిగిందంటే..?

Sivakarthikeyan : హీరో శివకార్తికేయన కారుకు ప్రమాదం..అసలేం జరిగిందంటే..?
Advertisement

Sivakarthikeyan : కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. శివ కార్తికేయన్ కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో శివ కార్తికేయన్ తృటిలో తప్పించుకున్నారు.. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది. చెన్నైలోని కైలాశ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని హీరోని సేఫ్ గా పంపించినట్లు తెలుస్తుంది. హీరో కారుని ఢీ కొట్టిన మరో కారు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీని గురించి పూర్తి వివరాలు మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..

శివ కార్తికేయన్ కారుకు ప్రమాదం.. 

తమిళ హీరో శివ కార్తికేయన్ ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.. ఈయన ప్రస్తుతం పరాశక్తి సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రిలీజ్ కాబోతుంది. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరుని పెంచింది. హీరో శివ కార్తికేయన్ తో పాటుగా చిత్ర యూనిట్ మొత్తం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అవుతున్న సమయంలోనే ఈ కారు ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న చిత్ర దర్శక, నిర్మాతలు ప్రస్తుతం ఆయనను పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగింది అని పోలీసుల ప్రధమ విచారణలో వెల్లడయింది. ఈ ప్రమాదంలో హీరోకు ఏమి కాలేదని తెలుసుకున్న అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

శివ కార్తికేయన్ సినిమాల విషయానికొస్తే.. 

Advertisement

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.. ఈయన గతంలో నటించిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. రెమో మూవీతో ప్రేక్షకులను మెప్పించాడు.. ఆ తర్వాత ఆయన నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా మదరాసి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. భారీ అంచనాలతో వచ్చిన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడింది. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతకుముందు రిలీజ్ అయిన అమరన్ చిత్రం అతని కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.. ప్రస్తుతం పరాశక్తి సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×