E-Paper
Advertisement

BCCI : గిల్ ఎందుకు లేడు? క్లారిటీ ఇచ్చిన అగార్కర్

BCCI : గిల్ ఎందుకు లేడు? క్లారిటీ ఇచ్చిన అగార్కర్
Advertisement

BCCI : టీమిండియా క్రికెట‌ర్ శుబ్ మ‌న్ గిల్ గురించి దాదాపు అంద‌రికీ తెలిసిందే. శుబ్ మన్ గిల్ ను ఇటీవ‌లే వ‌న్డే, టెస్ట్ జ‌ట్ల‌కు కెప్టెన్ గా కూడా ఎంపిక చేసింది బీసీసీఐ. కానీ తాజాగా ఓ షాక్ ఇచ్చింది. వ‌చ్చే ఏడాది జ‌రుగ‌బోయే టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ న‌కు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ. అయితే ఈ జ‌ట్టులో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శుబ్ మ‌న్ గిల్ కి చోటు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వ‌న్డే జ‌ట్టుకు, టెస్ట్ జ‌ట్టుకు రెగ్యుల‌ర్ కెప్టెన్ గా కొన‌సాగుతున్న శుబ్ మ‌న్ గిల్ కి ఐసీసీ ఈవెంట్ లో చోటు ద‌క్క‌క‌పోవ‌డం పై అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ కి గుర‌య్యారు. వాస్త‌వానికి శుబ్ మ‌న్ గిల్ టీ-20 మ్యాచ్ ల్లో ఫేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. గాయం కార‌ణంగా ఇటీవ‌ల సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ-20 సిరీస్ లో చివ‌రి మ్యాచ్ ల‌కు సైతం దూర‌మ‌య్యాడు.

Also Read : T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే టీమిండియా జట్టు ఇదే

అగార్క‌ర్ క్లారిటీ..!

Advertisement

టీమిండియా ఆట‌గాడు శుబ్ మ‌న్ గిల్ కి టీ-20 జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డం పై చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ వివ‌ర‌ణ ఇచ్చాడు. గిల్ చాలా అద్భుతంగా నైపుణ్యం ఉన్న ఆట‌గాడు అన‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని తెలిపాడు అజిత్ అగార్క‌ర్. కానీ ఇటీవ‌ల కాలంలో గిల్ పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేదు. త‌మ‌కు గిల్ బ్యాటింగ్ సామ‌ర్థ్యం పై ఎలాంటి అనుమానం లేద‌ని చెప్పాడు. గ‌త వ‌ర‌ల్డ్ క‌ప్ లో విభిన్న కాంబినేష‌న్ కార‌ణంగా గిల్ తృటిలో అవ‌కాశం కోల్పోయాడ‌ని వెల్ల‌డించాడు. ఇక ఈసారి కూడా జ‌ట్టు అవ‌స‌రాల దృష్ట్యా శుబ్ మ‌న్ గిల్ ను ప‌క్క‌కు పెట్టాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశాడు. ప్ర‌ధానంగా టాప్ ఆర్డ‌ర్ లో ఇద్ద‌రు వికెట్ కీప‌ర్లు ఉండాల‌నేది త‌మ ఆలోచ‌న అని అగార్క‌ర్ వెల్ల‌డించారు.

వైస్ కెప్టెన్ గా అక్ష‌ర్ ప‌టేల్

ప‌రుగుల విష‌యంలో కాస్త వెనుక‌ప‌డిన‌ప్ప‌టికీ.. గిల్ క్వాలిటీ ప్లేయ‌ర్ అని చెప్పారు. టీమ్ కాంబినేష‌న్ లో భాగంగా టాప్ ఆర్డ‌ర్ లో ఇద్ద‌రూ వికెట్ కీప‌ర్ల‌ను తీసుకోవాల్సి రావ‌డంతో గిల్ కు చోటు ద‌క్క‌లేద‌న్నారు. వ్య‌క్తిగ‌త సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి కాకుండా టీమ్ బ్యాలెన్స్ ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టు తెలిపారు. అటు కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. గిల్ జట్టు నుంచి తప్పుకోవడంతో, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను మళ్ళీ వైస్ కెప్టెన్ పదవి వరించింది. గతంలోనూ ఈ బాధ్యతలు నిర్వహించిన అక్షర్, జట్టులో సీనియర్ ప్లేయర్‌గా ఎదిగాడు. దక్షిణాఫ్రికా సిరీస్ చివర్లో అనారోగ్యం వల్ల అతను దూరమైనప్పటికీ, ప్రపంచకప్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తాడని బీసీసీఐ నమ్మకం వ్యక్తం చేసింది.

Advertisement

Also Read : Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్

Related News

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

351 ప‌రుగులు చేసినా ఓడిపోతారా ? బౌల‌ర్ల‌నే కాదు, గిల్ ను కూడా పీకిపారేయండి

అంపైర్లు నిద్ర‌పోతున్నారా ? రూథ‌ర్ ఫోర్డ్ అస‌లు ఔటే కాదు…ఆకాశ్ చోప్రా సీరియ‌స్‌

ద‌మ్ముంటే నా బౌలింగ్ లో సిక్సులు కొట్టురా…అమీర్ జంగూతో సిరాజ్ గొడ‌వ‌

వైభ‌వ్ కు కాదు, నీకు జోల పాట పాడే టైం ద‌గ్గ‌ర ప‌డింది..సైమ్ సెల‌బ్రేష‌న్స్ పై క‌మ్రాన్ సీరియ‌స్

Big Stories

Advertisement
×