E-Paper
Advertisement

పెళ్లి కాదు.. దాన్ని మాత్రమే చూడండి.. రూమర్స్ పై సంయుక్త రియాక్షన్!

పెళ్లి కాదు.. దాన్ని మాత్రమే చూడండి.. రూమర్స్ పై సంయుక్త రియాక్షన్!
Advertisement

Samyuktha Menon:సంయుక్త మీనన్ (Samyuktha Menon) .. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతోనే కాదు యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో కూడా అదరగొట్టగలను అని నిరూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె ఈ మధ్యకాలంలో పెళ్లి వార్తలతో పదే పదే వార్తల్లో నిలవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఇలాగే సంయుక్త వివాహం చేసుకోబోతోంది అంటూ రూమర్లు గట్టిగానే వినిపించాయి. ఆ సమయంలో సంయుక్త స్వయంగా స్పందించింది. తన పెళ్లి వార్తలను పక్కన పెట్టాలని నటిగా తన పనిని మాత్రమే గమనించాలి అంటూ అందరినీ కోరింది కూడా. ఇక ఈ మాటలతో పెళ్లి వార్తలకు చెక్ పడిందని అందరూ అనుకున్నారు.

సమంత పెళ్లి వార్తలు..

కానీ ఇప్పుడు మళ్లీ సంయుక్త పై పెళ్లి పుకార్లు గుప్పుమన్నాయి. 30 ఏళ్ల ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్, మలయాళం భాషలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ తన కెరీర్ ను పీక్ స్టేజ్ లో ఉంచుకుంది. ఇలాంటి సమయంలో ఈమె పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రచారం మొదలైంది. అయితే కొంతమంది రష్మిక మందన్న తరహాలో సంయుక్త కూడా పెళ్లి చేసుకుని తన కెరీర్ను కొనసాగిస్తుందని చెబుతుంటే .. మరి కొంతమంది సంయుక్త పెళ్లి చేసుకుని కొంతకాలం గ్యాప్ ఇస్తుంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సంయుక్త ఒకసారి స్పందించినా మళ్లీ పదే పదే ఇలాంటి రూమర్స్ రావడంతో అభిమానులు సైతం తట్టుకోలేకపోతున్నారు. మరి ఈ రూమర్స్ కి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

Advertisement

also read:ప్రకాష్ రాజ్ పై నటుడు మహేష్ సంచలన వ్యాఖ్యలు!

సంయుక్త తదుపరి చిత్రాలు..

సంయుక్త సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె నిఖిల్ తో కలిసి స్వయంభు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు చారిత్రక యాక్షన్ అడ్వెంచర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ ఒక పౌరాణిక యోధుడిగా నటిస్తున్నారు. భరత కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సంయుక్త మీనన్ , నభా నటేష్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంతోపాటు సంయుక్త లేడీ ఓరియంటెడ్ గా నటిస్తున్న చిత్రం బ్లాక్ గోల్డ్. పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ లేడీ ఓరియెంటెడ్ మూవీ గా వస్తున్న ఈ చిత్రంలో సంయుక్త ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. యోగేష్ కేఎంసీ దర్శకత్వంలో హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ఈ సమ్మర్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే 75% షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇలా ఈ రెండు చిత్రాలతో బిజీగా మారిపోయింది సంయుక్త. అలాగే మలయాళం, తమిళ్ భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు మండిపడుతున్నారు.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×