E-Paper
Advertisement

Five Shows: సినిమాలకు బూస్ట్ ఇచ్చిన సీఎం విజయ్.. రోజుకు 5 షోలుతో..!

Five Shows: సినిమాలకు బూస్ట్ ఇచ్చిన సీఎం విజయ్.. రోజుకు 5 షోలుతో..!
Advertisement

Five Shows: తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) ప్రయోజనాలే ధ్యేయంగా తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలైన మొదటి వారం రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తమిళ సినీ పరిశ్రమకు, ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాల వసూళ్లకు ఒక పెద్ద మైలురాయిగా మారనుంది.

Read also-Upcoming Movies : ఈ వారం థియేటర్లలో సందడి రిలీజయ్యే చిత్రాలు..

పాత నిబంధనలకు సవరణ

Advertisement

తమిళనాడు సినిమా (రెగ్యులేషన్) రూల్స్, 1957 ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రంలోని థియేటర్లలో రోజుకు కేవలం 4 రెగ్యులర్ షోలు మాత్రమే ప్రదర్శించడానికి అనుమతి ఉండేది. పండుగలు లేదా ప్రత్యేక సెలవు దినాల్లో 5వ షో (స్పెషల్ షో) వేసుకోవాలంటే జిల్లా కలెక్టర్లు లేదా చెన్నై పోలీస్ కమిషనర్ నుంచి ప్రత్యేక ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చేది. అయితే, ఇటీవల (మే 16న) తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సీఎం విజయ్‌ను కలిసి, చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అందులో భాగంగా రోజుకు 5 షోలు వేసుకునేలా నిబంధనలను సవరించాలని కోరారు. పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సీఎం విజయ్ ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ పాత చట్టానికి సవరణలు చేశారు.

జీవోలోని అంశాలు..

మొదటి 7 రోజులు ఐదు షోలు: కొత్త తమిళ సినిమాలు విడుదలైన మొదటి 7 రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు.

Advertisement

వీకెండ్స్ & హాలిడేస్: మొదటి వారమే కాకుండా.. అన్ని శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలు, స్థానిక పండుగ రోజుల్లో కూడా ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఉంటుంది.

ప్రత్యేక అనుమతులు అవసరం లేదు: ఈ నిర్ణీత రోజుల్లో 5వ షో వేసుకోవడానికి థియేటర్ల యజమానులు ప్రభుత్వం నుండి లేదా లైసెన్సింగ్ అధికారుల నుండి ఎలాంటి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు.

Read also-బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు.. ‘లూమియో విజన్9 4K’ గూగుల్ టీవీ మామూలుగా లేదుగా..

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం!

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైన మొదటి వారంలో టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. తాజా నిర్ణయంతో మొదటి వారంలోనే థియేటర్ల వద్ద కలెక్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే పైరసీ ప్రభావం తగ్గడానికి, అభిమానులందరికీ మొదటి వారంలోనే సినిమా చూసే అవకాశం దక్కడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల తమిళ చిత్ర పరిశ్రమ ప్రతినిధులు, థియేటర్ల యాజమాన్యాలు మరియు సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ థియేట్రికల్ బిజినెస్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లడంలో ఈ ఆర్డర్ ‘గేమ్ ఛేంజర్’ కానుందని పరిశ్రమ వర్గాలు కొనియాడుతున్నాయి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×