Dinesh Karthik: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మే 22వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ అలాగే విరాట్ కోహ్లీ మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత షేక్ హ్యాండ్ ( No Shake Hand) ఇచ్చేందుకు వెళ్లిన హెడ్ ను ( Travis Head) అవమానించాడు విరాట్ కోహ్లీ (Virat Kohli). దీంతో వివాదం రాజుకుంది. విరాట్ కోహ్లీని ఉద్దేశించి మాజీ క్రికెటర్లు… పాకిస్తాన్ సీనియర్ దిగ్గజాలు విమర్శలు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఇదే తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ నేపథ్యంలో రెచ్చిపోయిన విరాట్ కోహ్లీ, RCB అభిమానులు… హెడ్ భార్యను టార్గెట్ చేశారు. రే**ప్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ భార్య జెస్సికాను RCB అభిమానులు టార్గెట్ చేసి కామెంట్లు చేసిన నేపథ్యంలో ఆ జట్టు కోచ్ దినేష్ కార్తీక్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అశ్విన్ నిర్వహించిన ఇంటర్వ్యూలో… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులను స్వయంగా ఆ జట్టు కోచ్ దినేష్ కార్తీక్ బూతులు తిట్టారు. బెంగళూరు జట్టులో సాధారణ ఆటగాడిగా తాను ఉన్నప్పుడు… ఒక్కసారి విఫలమైనా కూడా బెంగుళూరు అభిమానులు రెచ్చిపోయేవారని ఆగ్రహించారు. తన భార్యను కూడా ఈ వివాదం లోకి లాగి.. రే**ప్ చేస్తామని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారని దినేష్ కార్తీక్ షాకింగ్ నిజాలను బయటపెట్టారు. అంత దారుణంగా బెంగళూరు అభిమానులు వ్యవహరించారని దినేష్ కార్తీక్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు హెడ్ కోచ్ గా ఉన్నాను కాబట్టి.. ఆ ట్రోలింగ్ తగ్గిపోయిందన్నారు. మొన్న టైటిల్ గెలిచిన తర్వాత తిట్టిన బెంగళూరు అభిమానులే.. తనను మెచ్చుకుంటున్నారని వివరించారు. దీంతో దినేష్ కార్తీక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఉగ్రవాదులు లాగా మారుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో దినేష్ కార్తీక్ ను సొంత అభిమానులే దారుణంగా తిట్టారని గుర్తు చేస్తున్నారు. దినేష్ కార్తీక్ (Dinesh Karthik) భార్య, కుటుంబాన్ని పచ్చి బూతులతో కడిగిపారేసారని బెంగుళూరు ( RCB Fans) అభిమానులపై దారుణంగా పోస్టులు పెడుతున్నారు నెటిజెన్స్. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని గెలికిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెడ్ ను వదులుతారా ? నరకం చూపిస్తారంటూ మరికొంతమంది పోస్టులు వైరల్ చేస్తున్నారు.
Dinesh Karthik- “Sometimes I used to feel afraid while playing for RCB. After a bad game, some fans would abuse and give r@pe threats to my wife and family on social media.
And this coming from an RCB coach shows which fanbase is a disgrace to humanity pic.twitter.com/wSI6LIjt8p
— Aarav MSdian ™️ (@Itz_aarav_07) May 25, 2026