E-Paper
Advertisement

CM Chandrababu: రైతులకు భారీ శుభవార్త.. ఖాతాల్లో రూ. 7,000 జమ, ఇలా చేయండి..

CM Chandrababu: రైతులకు భారీ శుభవార్త.. ఖాతాల్లో రూ. 7,000 జమ, ఇలా చేయండి..
Advertisement

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ప్రతి రైతు ఖాతాలో రూ. 7,000 చొప్పున జమ చేసేందుకు సిద్ధమైంది. ఈ నిధులు ముఖ్యమంత్రి కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద విడుదల చేయనున్నారు.

ఈ నిధులను ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో లాంఛనంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. నిధుల విడుదల అనంతరం ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఇంటరాక్షన్ కార్యక్రమంలో రైతుల సమస్యలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు, ప్రభుత్వానికి మధ్య మరింత మెరుగైన సమన్వయం ఏర్పడుతుందని భావిస్తున్నారు.

Advertisement

అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులైన రైతులు తమ స్టేటస్ తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రైతులు annadathasukhibhava.ap.gov.in అనే అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి.

పోర్టల్ ద్వారా స్టేటస్ తెలుసుకునే ప్రక్రియ..

  1. ముందుగా పోర్టల్ హోమ్ పేజీలో కనిపించే “Know Your Status” (మీ స్టేటస్ తెలుసుకోండి) అనే విభాగాన్ని ఎంచుకోవాలి.

  2. ఆ తరువాత.. అడిగిన విధంగా అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి.

  3. వివరాలు నమోదు చేసిన తర్వాత రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులు అవునో కాదో వెంటనే తెలుసుకోవచ్చు.

Advertisement

ఈ నిధుల విడుదల రాష్ట్రంలోని రైతాంగానికి ఆర్థికంగా గొప్ప ఊరటనిస్తుందని.. వ్యవసాయ కార్యకలాపాలకు ఇది మరింత తోడ్పాటునందిస్తుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా రైతులంతా తమ అర్హతలను తెలుసుకుని, ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ALSO READ: Nara Lokesh: ఎన్డీఏలో కీలకంగా లోకేష్.. బీహార్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×