E-Paper
Advertisement

Akhanda 2 : Akhanda 2: అఖండ సెకండ్ సింగిల్ వచ్చేసింది, బాలయ్య స్టెప్స్ అదుర్స్ నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ

Akhanda 2 : Akhanda 2: అఖండ సెకండ్ సింగిల్ వచ్చేసింది, బాలయ్య స్టెప్స్ అదుర్స్ నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ
Advertisement

Advertisement

Akhanda 2 Second Song Release: బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. కేవలం తెలుగు ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేయకుండా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే సినిమా మొదటి సాంగ్ ను ముంబై వేదికగా విడుదల చేశారు. ఆ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 

సెకండ్ సింగిల్ టాక్

కైలాస్ ఖేర్ , శంకర్ మహదేవన్ పాడిన ఆ పాట మంచి ఆధ్యాత్మిక ఫీల్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా నుంచి కొద్దిసేపటి క్రితమే రెండవ పాటను విడుదల చేశారు. ఈ పాట కూడా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు.ఈ సినిమా నుంచి జాజికాయ అనే సెకండ్ సింగిల్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈ పాటలో బాలయ్య ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. అఖండ సినిమాలో జై బాలయ్య సాంగ్ తరహాలోనే ఈ సాంగ్ ఉంది. పాటలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటోని వాడటం మరో హైలెట్.

Advertisement

బాలకృష్ణ సంయుక్త మీనన్ స్టెప్స్ చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. ఈ పాట లో కొన్ని లిరిక్స్ తో పాటు వీరిద్దరూ కలిసిన డాన్స్ వీడియోలు కూడా కట్ చేసి పెట్టడం అనేది సాంగ్ కి మంచి బ్యూటీ ఇచ్చింది. ఈ పాటకు భాను కొరియోగ్రఫీ చేశారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సరిపడా స్టెప్స్ డిజైన్ చేశాడు భాను. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కొన్ని పదాలను ఈ పాటలో పెట్టాడు శ్యామ్.శ్రేయ ఘోషల్ మరియు శాండిల్య ఈ పాటను పాడారు.

తమన్ విధ్వంసం

తమన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకడు. అయితే కొన్ని సినిమాలకి తమన్ మ్యూజిక్ వింటుంటే వాళ్లకు మాత్రమే ఎందుకు ఇంత అద్భుతంగా మ్యూజిక్ చేస్తాడు అనే ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. తమన్ అరవింద సమేత వీర రాఘవ తరువాత చేసిన కొన్ని ఆల్బమ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ముఖ్యంగా బాలకృష్ణ సినిమా అంటే తనలోని అసలైన అభిమాని బయటకు వస్తాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే కొంతమంది సోషల్ మీడియా వేదికగా నందమూరి తమన్ అని పిలుస్తూ ఉంటారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ జి సినిమాకి కూడా అద్భుతమైన సాంగ్స్ తో పాటు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. ప్రస్తుతం అఖండ 2 తమన్ ఇచ్చిన సాంగ్స్ అయితే వర్కౌట్ అయిపోతున్నాయి. ఒక బ్యాగ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఇచ్చాడో చూడాలి.

Also Read: IBomma Ravi Case : ఐబొమ్మ రవికి ఇక మూడినట్టే.. రంగంలోకి ఈడీ.. 30 అకౌంట్స్ గుర్తింపు

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×