E-Paper
Advertisement

Tharun Bhascker: హీరోయిన్‌తో ప్రేమాయణం.. ఎంజాయ్ చేస్తున్న అంటూ స్టేజ్‌పైనే క్లారిటి ఇచ్చిన డైరెక్టర్

Tharun Bhascker: హీరోయిన్‌తో ప్రేమాయణం.. ఎంజాయ్ చేస్తున్న అంటూ స్టేజ్‌పైనే క్లారిటి ఇచ్చిన డైరెక్టర్
Advertisement

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ పరిచయం అవసరం లేని పేరు. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాల ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ప్రస్తుతం సినిమాలలో హీరోగా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా తరుణ్ భాస్కర్(Tharun Bhascker) సినిమాల పరంగా బిజీగా ఉంటూనే వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా తరుణ్ భాస్కర్ ముఖ్య అతిథిగా రాజు వెడ్స్ రాంబాయి(Raju Weds Rambai) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ ఈయనని ప్రశ్నిస్తూ.. మీరు నిజ జీవితంలో చూసిన గ్రేట్ లవ్ స్టోరీ ఎవరిదైనా ఉందా? అంటూ ప్రశ్నించారు.

ఈషా రెబ్బా ప్రేమలో తరుణ్ భాస్కర్?

ఈ ప్రశ్నకు తరుణ్ భాస్కర్ సమాధానం చెబుతూ.. నాదే అండీ నేను లవ్ లో ఎంజాయ్ చేస్తున్నాను.. త్వరలో మా ప్రేమే గ్రేట్ లవ్ స్టోరీ అవుతుందేమో అంటూ ఈయన మాట్లాడటంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే గత కొద్దిరోజులుగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. ఇలా వీరి ప్రేమ గురించి వార్తలు వస్తున్న ఎక్కడ ఈ జంట స్పందించలేదు కానీ తాజాగా తరుణ్ భాస్కర్ తాను ప్రేమలో ఉన్నానని మాదే గ్రేట్ లవ్ స్టోరీ అవుతుంది అంటూ చెప్పడంతో ఈయన తమ ప్రేమ గురించి ఇలా క్లారిటీ ఇచ్చారని అభిమానులు భావిస్తున్నారు.

తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా జంటగా..

Advertisement

ఇకపోతే తరుణ్ భాస్కర్ ఇటీవల కాలంలో వరుస సినిమాలలో కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ ఓం శాంతి శాంతి సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా మలయాళంలో వచ్చిన జయ జయహే సినిమాకు రీమేక్ సినిమాగా రానుంది. ఈ సినిమాలో జంటగా నటిస్తున్న నేపథ్యంలోనే ఇద్దరు మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఇలా వీరిద్దరి గురించి లవ్ రూమర్లు బయటకు రావడమే కాకుండా అందుకు అనుగుణంగా వీరిద్దరూ జంటగా కలిసి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వార్తలకు బలం చేకూరింది.

ఒకే చోట దీపావళి సెలబ్రేషన్స్..

Advertisement

గత దీపావళి పండుగను పురస్కరించుకొని ఈషా రెబ్బ తరుణ్ భాస్కర్ ఇద్దరు ఒకే చోట దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా వీరి ప్రేమ గురించి తరచూ వార్తలు వస్తున్నప్పటికీ ఎక్కడ స్పందించలేదు కానీ తాజాగా తరుణ్ భాస్కర్ చేసిన ఈ కామెంట్లతో వీరి రిలేషన్ కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. అయితే ఇదివరకే తరుణ్ భాస్కర్ కు పెళ్లి జరిగి తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారని కూడా తెలుస్తోంది. ఇక వీరి ప్రేమ గురించి ఇద్దరు అధికారికంగా వెల్లడించడమే ఆలస్యం. తరుణ్ భాస్కర్, ఈషా ఇద్దరు కూడా వరంగల్ జిల్లాకు చెందినవారు కావటం విశేషం. అంతకుముందు ఆ తర్వాత అనే సినిమా ద్వారా ఈషా రెబ్బా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈమె అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

Also Read: Anupama Parameswaran: అనుపమ అరుదైన రికార్డు… హ్యాట్రిక్ కొట్టిన నటి!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×