E-Paper
Advertisement

Fire Accident: విశాఖలోని మద్దిలపాలెం ఫంక్షన్ హాల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.

Fire Accident: విశాఖలోని మద్దిలపాలెం ఫంక్షన్ హాల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.
Advertisement

Fire Accident: వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మృత్యువు ఏదో ఒక రూపంలో వస్తున్నాడు. నేడు ఒక్క రోజే రెండు ప్రాంతాల్లో బారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. ఇలా వరుస ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. నేడు విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

విశాఖలోని మద్దిలపాలెం ఫంక్షన్ హాల్‌లో అగ్ని ప్రమాదం..
విశాఖ మద్దిలపాలెంలోని వంశీ ఫంక్షన్ హాల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు ప్రారంభించారు.

Advertisement

ఫంక్షన్ హాల్ మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో మంటలను అదుపు చేయడం వారికి కష్టంగా మారింది. ప్రాణ నష్టం జరగనప్పటికీ, ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చని సిబ్బంది ప్రాథమికంగా భావిస్తున్నారు.

Advertisement

Also Read: తీవ్ర విషాదం.. శబరిమల యాత్రలో అపశృతి.. క్యూలైన్‌లో మహిళ మృతి..!

మరో అగ్ని ప్రమాదం.. 

లారీలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల జాతీయ రహదారిపై వెళుతున్న ఒక లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు గమనించిన లారీ డ్రైవర్ వెంటనే దిగిపోయాడు. అయితే వైర్ల లోడుతో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్దమై.. కాలి బూడిదైన వైర్లు.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు..

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×