E-Paper
Advertisement

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో దెయ్యం… ఓటీటీలోకి వచ్చేసిన 485 కోట్ల హర్రర్ థ్రిల్లర్

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో దెయ్యం… ఓటీటీలోకి వచ్చేసిన 485 కోట్ల హర్రర్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీలోకి మరో సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఓటీటీలో కూడా భయపెడుతోంది. సుమారు రూ.132 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, 485 కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఈ కథ ఒక స్విమ్మింగ్ పూల్ దెయ్యం చుట్టూ తిరుగుతుంది. హారర్ ఎలిమెంట్స్ తో పరుగులు పెట్టిస్తున్న ఈ సినిమాను, థ్రిల్లర్ ఫ్యాన్స్ తెగ చూస్తున్నారు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘నైట్ స్విమ్’. బ్రైస్ మెక్గ్వెర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ 2024, జనవరి 5న థియేటర్లలో రిలీజైంది. ఇది 2025 నవంబర్ 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో వ్యాట్ రసెల్, కెర్రీ కాండాన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఒక గంటా 38 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉంది. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రే వాలర్ ఒకప్పుడు ప్రొఫెషనల్ బేస్‌బాల్ ప్లేయర్. ఇప్పుడు కెరీర్ ముగిసిపోయి, భార్య ఈవ్, పదహారేళ్ల కూతురు ఇజ్జీ, పదేళ్ల కొడుకు ఎలియట్‌లతో కొత్త ఇంటికి వెళ్తాడు. ఇంటి వెనకాల పెద్ద స్విమ్మింగ్ పూల్ చూసి రేకి ఫిజియోథెరపీకి, పిల్లలకు ఆటకి పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. మొదట్లో అందరూ హ్యాపీగానే ఉంటారు. కానీ కొన్ని రోజులకే వింత సంఘటనలు మొదలవుతాయి. ఒక రోజు ఎలియట్ పూల్‌లో ఆడుకుంటుండగా ఏదో చేయి అతన్ని కిందికి లాగుతుంది. ఇజ్జీ రాత్రి స్విమ్ చేస్తుండగా నీటి కింద నల్లటి నీడలు కనిపిస్తాయి. దీంతో అనుమానం వచ్చి ఈవ్ ఆ ఇంటి గత చరిత్ర తెలుసుకుంటుంది.

Read Also : ఊళ్ళో ఏ అమ్మాయినీ వదలని దొర… బతికుండగానే కూతురిని పూడ్చిపెట్టే తండ్రి… మెంటలెక్కించే ట్విస్టులు

Advertisement

1992లో ఆ ఇంట్లో రెబెకా అనే ఒక అమ్మాయి పూల్‌లో మునిగిపోయి చనిపోయింది. ఆమె తల్లి క్యాథీ ఇప్పటికీ పక్కింట్లోనే ఉంటుంది. ఈవ్ కి క్యాథీ మరిన్ని విషయాలు చెప్తుంది. ఆ పూల్ ఒక వింత శక్తి ఉందని, ఎవరైనా తమకు ప్రియమైన వ్యక్తిని బలి ఇస్తే, పూల్ వాళ్ల కోరికను తీర్చుతుందని ఆమె ద్వారా తెలుసుకుంటుంది. నిజాని రెబెకా తమ్ముడికి ఉన్న భయంకరమైన జబ్బును నయం చేయడానికి, తల్లి ఆమెను బలి ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆ సూపర్ నేచురల్ పవర్ ఈవ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది. చివరికి ఈవ్ ఫ్యామిలీ, ఈ స్విమ్మింగ్ ఫూల్ దెయ్యం నుంచి బయట పడుతుందా ? దానికి వీళ్ళు బలవుతారా ? అనే విషయాలను సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×