E-Paper
Advertisement

అల్లు అర్జున్ రాకా లుక్ వెనుక కష్టం..మేకప్ కోసమే అన్ని గంటలు పట్టేదా..  హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

అల్లు అర్జున్ రాకా లుక్ వెనుక కష్టం..మేకప్ కోసమే అన్ని గంటలు పట్టేదా..  హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
Advertisement

Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ (Atlee)దర్శకత్వంలో రాకా(Raaka) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ తదుపరి చిత్రం రాకా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా 70% షూటింగ్ పనులు కూడా జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఇలా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ తో పాటు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

అంచనాలు పెంచిన రాకా ఫస్ట్ లుక్..

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లు అర్జున్ ఒక రాక్షసుడు గా కనిపించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్టర్ చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు చేశారు దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కు సంబంధించిన పోస్టర్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

ప్రతిరోజు 4.3 గంటలు మేకప్..

Advertisement

అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపించిన లుక్ కోసం చిత్ర బృందం భారీ స్థాయిలో కష్టపడ్డారని చెప్పాలి. ఈ మేకప్ వేయడం కోసం ప్రతిరోజు 4.3 గంటలు కష్టపడే వారిని తెలుస్తుంది. ఈ లుక్ వెనుక ప్రతి చిన్న విషయాన్ని చాలా స్పష్టంగా తీర్చిదిద్దడం కోసం ఇంత సమయం పట్టేదని తెలుస్తోంది. ఇలా ఈ ఒక్క లుక్ కోసం ప్రతి రోజు 4:3 గంటల సమయం కేటాయించేవారు అంటే అల్లు అర్జున్ ఓపికకు హాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమాలలో నటించడం కంటే మేకప్ కోసం గంటల తరబడి కూర్చోవడం అనేది సాహసమే అని చెప్పాలి. కానీ ప్రతిరోజు అల్లు అర్జున్ 4.3 గంటలు మేకప్ కోసమే సమయం కేటాయిస్తారనే విషయం తెలుసునా అభిమానులు బన్నీకి సినిమా పట్ల ఉన్న డెడికేషన్ కు ఫిదా అవుతున్నారు.

కళ్ళు చెదిరి రేంజ్ లో బన్నీ రెమ్యూనరేషన్..

Advertisement

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడిగా దీపికా పదుకొనే నటించబోతున్నారు. అలాగే నెగిటివ్ పాత్రలో రష్మిక మందన్న కూడా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో మరొకటి మృణాళ్ ఠాకూర్ కూడా నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు సరైన స్పష్టత మాత్రం లేదు. ఈ సినిమా కోసం సన్ పిక్చర్ బ్యానర్స్ పై కళానిధి మారన్ ఏకంగా 800 కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నారని ఇందులో 175 కోట్లు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్, అలాగే సినిమా లాభాలలో 15% వాటా కూడా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. 2027లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు.

Also Read: లవ్ మ్యారేజ్ చేసుకుంటాను… పెళ్లి పై ప్రభాస్ ఓపెన్ కామెంట్స్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×