E-Paper
Advertisement

బాల్ టాంప‌రింగ్ క‌ల‌క‌లం..అంపైర్ల‌కు చికాకు తెప్పించిన‌ టిమ్ డేవిడ్, బ్యాన్ త‌ప్ప‌దా ?

బాల్ టాంప‌రింగ్ క‌ల‌క‌లం..అంపైర్ల‌కు చికాకు తెప్పించిన‌ టిమ్ డేవిడ్, బ్యాన్ త‌ప్ప‌దా ?
Advertisement

Tim David:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ( Mumbai Indians vs Royal Challengers Bengaluru) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. అందరూ ఊహించినట్లుగానే ఈ మ్యాచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన డేంజర్ ఆటగాడు టిమ్ డేవిడ్ ( Tim David ) చేసిన పని వివాదంగా మారింది. బాల్ టాంప‌రింగ్ ( Ball Tampering) జ‌రిగింద‌నే అనుమానం వ్య‌క్తం చేస్తూ, ముంబై బౌలర్ల నుంచి బంతిని తీసుకున్నాడు టిమ్ డేవిడ్. ఆ త‌ర్వాత‌ ఫీల్డ్ అంపైర్లకు చుక్కలు చూపించాడు. బాల్ వెనక్కి ఇవ్వు అంటూ ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు మొత్తుకున్నారు. అయినా కూడా బంతి వెనక్కి ఇవ్వకుండా, అంపైర్లకు చుక్కలు చూపించాడు టిమ్ డేవిడ్. చివరికి ఔట్ ఇస్తామని అంపైర్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో బంతిని వదిలేశాడు టిమ్ డేవిడ్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో టిమ్ డేవిడ్ పై బీసీసీఐ ( BCCI) చర్యలు తీసుకునే అవకాశం ఉందని.. ఒక మ్యాచ్ ఆడకుండా బ్యాన్‌ విధిస్తారని చర్చ జరుగుతోంది.

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

అంపైర్ల‌కు చికాకు తెప్పించిన‌ టిమ్ డేవిడ్, బ్యాన్ త‌ప్ప‌దా ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament)  నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 18వ ఓవర్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న బెంగళూరు ఆటగాడు టిమ్ డేవిడ్, ముంబై బౌలర్ల నుంచి బంతిని లాగేసుకున్నాడు. బాల్ టాంపరింగ్ జరిగిందని అనుమానం వ్యక్తం చేసి ఈ పని చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు ఇద్దరు రంగంలోకి దిగి, టిమ్ డేవిడ్ నుంచి బంతిని వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించారు.

అయితే అంపైర్లు అడగగానే ఇవ్వకుండా, బంతిని గాల్లోకి ఎగిరేస్తూ చికాకు తెప్పించాడు. చివరికి ఓ అంపైర్, ఔట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో, వెన్నక్కి త‌గ్గాడు టిమ్ డేవిడ్. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ అయింది. దీంతో టిమ్ డేవిడ్ పైన బీసీసీఐ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని క్రీడా విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు. బీసీసీఐ రూల్స్ ప్ర‌కారం, బంతిని చెక్ చేసే అధికారం ఓ బ్యాట‌ర్ కు ఉండ‌దు. అది కేవ‌లం అంపైర్లు ( Umpires) మాత్ర‌మే చేస్తారు. కానీ ఈ రూల్స్ బ్రేక్ చేసిన టిమ్ డేవిడ్, అంపైర్ల‌తో ఆడుకున్నాడు. దీంతో అత‌నిపై ఓ మ్యాచ్ ఆడ‌కుండా బ్యాన్ విధించాల‌ని ముంబై ఇండియ‌న్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Advertisement

 

 

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ సూర్యవంశీ “ఇల్లీగ‌ల్ డ్ర‌గ్స్” తీసుకున్నాడు, వెంట‌నే విచార‌ణ చేయండి

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×