E-Paper
Advertisement

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది
Advertisement

LeT Confession Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాకిస్థాన్‌కు సంబంధించిన ఉగ్రవాద సంస్థ‌లు ఉన్న‌ట్లు మరోసారి రుజువైంది. ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాద సంస్థ Lashkar-e-Taiba కు చెందిన అగ్రశ్రేణి కమాండర్ అబు మూసా కాశ్మీరీ చేసిన వ్యాఖ్యలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఈ దారుణ దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఆ ఘటన వెనుక పాకిస్థాన్ ప్రత్యక్ష పాత్ర ఉందని అతను ఒక వీడియో ద్వారా అంగీకరించడం ఇప్పుడు క‌ల‌కలం రేపుతోంది.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో అబు మూసా మాట్లాడుతూ.. పహల్గామ్ దాడి పాకిస్థాన్ అంతర్జాతీయ స్థాయిని పెంచిందని వ్యాఖ్యానించాడు. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విఫలమైందని.. దానికి ప్రతిగా పాక్ చేపట్టిన ‘బున్యాన్-ఉన్-మర్సూస్’ అనే చర్య తమ దేశాన్ని 50 ఏళ్లు ముందుకు తీసుకెళ్లిందని అతను పేర్కొన్నాడు. పహల్గామ్ దాడులు తప్పో ఒప్పో తనకు తెలియదు కానీ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పాకిస్థాన్‌కు మేలు చేశాయని చెప్పడం గమనార్హం. గతంలో ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని ఇస్లామాబాద్ చేసిన వాదనలన్నీ పచ్చి అబద్ధాలని ఈ వ్యాఖ్యలతో రుజువయ్యాయి.

Advertisement

అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్ ఒక దౌత్యపరమైన అవకాశంగా మార్చుకుందని అబు మూసా వెల్లడించాడు. అమెరికా మరియు ఇరాన్ మధ్య ప్రస్తుతం సాగుతున్న శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. పహల్గామ్ దాడి సృష్టించిన ఉద్రిక్తతల ద్వారానే పాక్ తనను తాను ఒక కీలక మధ్యవర్తిగా అంతర్జాతీయ వేదికపై నిలబెట్టుకోగలిగిందని అతను వివరించాడు. అంటే ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే, మరోవైపు శాంతి చర్చలకు వేదికగా మారుతూ పాక్ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తోందని స్పష్టమవుతోంది.

అబు మూసా కాశ్మీరీ కేవలం ఈ ఒప్పుకోలుకే పరిమితం కాలేదు. గతంలో అతను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) నుండి విడుదల చేసిన వీడియోలలో హిందువులపై తీవ్ర విద్వేషం వెళ్లగక్కాడు. కాశ్మీర్ సమస్య కేవలం ఉగ్రవాదం మరియు జిహాద్ ద్వారానే పరిష్కారమవుతుందని, హిందువుల తలలు నరుకుతామని అతను బహిరంగంగా బెదిరించాడు. జమ్మూ కాశ్మీర్ యునైటెడ్ మూవ్‌మెంట్ అనే సంస్థతో సంబంధం ఉన్న ఇతడు.. పాక్ పాలకులు ఇస్లామిక్ సూత్రాలను విస్మరిస్తున్నారని, జిహాద్ మార్గంలో నడవడం లేదని వారిని కూడా విమర్శించడం గమనార్హం.

Advertisement

పహల్గామ్ దాడి జరిగిన వెంటనే భారత్ దీని వెనుక పాక్ కుట్ర ఉందని ఆధారాలతో సహా పేర్కొంది. అయితే అప్పట్లో పాక్ సైన్యం భారత్ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని, ఇవి అవాస్తవాలని బుకాయించింది. ఇప్పుడు తమ దేశంలోనే తలదాచుకుంటున్న లష్కర్ కమాండర్ చేసిన ఈ వాదనలు పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా దోషిగా నిలబెడుతున్నాయి. ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ విశ్వసనీయతపై ఈ పరిణామం పెను ప్రశ్నార్థకంగా మారింది. ఉగ్రవాదాన్ని ఒక విదేశీ విధాన సాధనంగా వాడుకుంటున్న పాక్ తీరును ప్రపంచ దేశాలు ఖండించాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read Also: ఇరాన్‌తో చర్చలు విఫలం.. హర్మూజ్ జలసంధి మూసివేయాల‌ని ట్రంప్ సంచలన ఆదేశం!

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×