BigTV English
Advertisement

Telangana : తెలంగాణ బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌…

Telangana : తెలంగాణ బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌…

Telangana: తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో…బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌… ప్ర‌జా పాల‌న‌, తెలంగాణ పండుగ‌లు, చ‌రిత్ర, సంస్కృతి నేప‌థ్యంగా పోటీలు. పోటీలో పాల్గొనేందుకు యువ సృజ‌న‌శీలురకు ఆహ్వానం.  తెలంగాణ‌లోని యువ సృజ‌న‌శీలుర‌కు ప‌ట్టం క‌ట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వ‌హించ‌నుంది.


ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం (మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, మ‌హాల‌క్ష్మి, గృహ‌జ్యోతి, ఇందిర‌మ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ త‌దిత‌రాలు), తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతి, పండుగ‌లు, క‌ళారూపాల‌పై షార్ట్ ఫిలిమ్స్‌, పాట‌ల పోటీలు ఉంటాయి.

షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాల‌కు, పాట‌ల వ్య‌వ‌ధి 5 నిమిషాల‌కు మించి ఉండ‌కూడ‌దు.


పోటీలకు సంబంధించిన అర్హతలు :

1.ఈ పోటీలో పాల్గొనే వారందరూ 40 ఏళ్ళ లోపు వయసు కలిగి ఉండాలి.

2. 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి.

3. షార్ట్ ఫిల్మ్స్/ వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన ‘థీమ్’ ల పైనే ఉండాలి.

4. మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు.

5. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినవై ఉండాలి

పోటీల్లో ఎంపికైన థీమ్స్‌కు

ప్ర‌థ‌మ బ‌హుమ‌తి – రూ.3 ల‌క్షలు

ద్వితీయ బ‌హుమ‌తి – రూ.2 ల‌క్ష‌లు

తృతీయ బ‌హుమ‌తి – రూ.1 ల‌క్ష‌

కన్సోలేష‌న్ బ‌హుమ‌తి – రూ. 20 వేలు (అయిదుగురికి) ఇవ్వ‌డంతో పాటు విజేత‌లంద‌రికీ ప్ర‌శంసా ప‌త్రం, జ్ఞాపిక ప్ర‌దానం చేస్తారు.

గడువులోగా వచ్చేసిన ఎంట్రీలను వీక్షించి, పరిశీలించిన నిపుణులతో కూడిన జ్యూరీ వివిధ కేటగిరీలలో వివిధ విభాగాలకు అర్హులైన చిత్రాలను ఎంపిక చేస్తుంది.

ఎంట్రీల‌ను ఈ కింది మెయిల్ ఐడీ

youngfilmmakerschallenge@gmail.com

లేదా

వాట్సాప్ నెంబర్ – 8125834009 (WhatsApp Only)కు పంపాలి

ఎంట్రీల‌ను పంపించేందుకు తుది గ‌డువు సెప్టెంబ‌రు 30, 2025.

– దిల్ రాజు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్

Related News

Ram Pothineni : రామ్ చరణ్ దారిలో రామ్ పోతినేని, ఇది శుభ పరిణామం

Prabhas -Rashmika : ప్రభాస్ సినిమాలో రష్మిక.. చచ్చిపోతానన్న నెటిజెన్.. ఏమైందంటే?

Bandla Ganesh: ఒక్క సినిమా హిట్టు కొడితే, అలా బిహేవ్ చేస్తారు, బండ్ల కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

Bandla Ganesh: కిరణ్ అబ్బవరం రియల్ హీరో.. చిరంజీవితో పోల్చిన బండ్ల గణేష్!

Rajesh Danda: అలా చేయకుండా ఉండాల్సింది, ప్రొడ్యూసర్ రిలైజేషన్

Bandla Ganesh: సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్ లు వర్కౌట్ అవ్వవు.. రిక్వెస్టుల మాత్రమే!

The Girl Friend censor: సెన్సార్ పూర్తి చేసుకున్న రష్మిక ది గర్ల్ ఫ్రెండ్.. రన్ టైం ఎంతంటే?

Vijay Sethupathi : అడ్జస్ట్ అవ్వండి ఆ పని కూడా చేస్తా, విజయ్ సేతుపతి ఏంటి అంత మాట అనేసాడు?

Big Stories

×