NVS Reddy: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అలాగే మరో ఐదుగురు అధికారులకు పోస్టింగ్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ గా శృతి ఓజా, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీస్ రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. హెచ్ఎండీఏ సెక్రటరీగా కోటా శ్రీవాత్స, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ గా రాజిరెడ్డి, అర్బన్ ట్రాన్స్ పోర్ట్ సలహాదారుగా కూడా ఎన్వీస్ రెడ్డి రెండేళ్ల పాటు పని చేయనున్నారు.. ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా రాజేశ్వర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఐఏఎస్‌ల బదిలీలు..
హైదరాబాద్ మెట్రో ఎండీ – సర్ఫరాజ్ అహ్మద్
ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ – శృతి ఓజా
సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ – కృష్ణ ఆదిత్య
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు – ఎన్వీఎస్ రెడ్డి (అర్బన్ ట్రాన్స్ పోర్ట్ సలహాదారుగా కూడా ఎన్వీస్ రెడ్డి రెండేళ్ల పాటు పని చేయనున్నారు)
చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ – రాజిరెడ్డి
ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ – రాజేశ్వర్
ALSO READ: TGPSC: టీజీపీఎస్సీ ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు.. వారి ప్రధాన డిమాండ్ ఇదే..
ALSO READ: Rammohan Reddy: ఆ కారణంతో త్వరలోనే కేటీఆర్ అరెస్ట్.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు