Percentage System : పర్సెంటేజ్..పర్సెంటేజ్..పర్సెంటేజ్…ఈ పదమే గత రెండు మూడు రోజులుగా ఫిలిమ్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. మాకు రెంటల్ వర్కౌట్ అవ్వట్లేదు,పర్సెంటేజ్ కావాల్సిందే అంటూ తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పెట్టగా, ఇప్పుడే కష్టమంటూ గిల్డ్ ప్రొడ్యూసర్స్ కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెల్సిందే.ఇక ఇదిలా ఉండగా దానికి కౌంటర్ గా ఈరోజు సినీ ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో సి. కళ్యాణ్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ రామ్ మోహన్ రావు, అనుపమ్ రెడ్డి, బాల గోవింద్ వంటి ప్రముఖులు పాల్గొని ప్రొడ్యూసర్లపై ఫైర్ అయ్యారు
ఆవేదన బయట పెట్టిన ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ ఉన్నపళంగా మేమీ సమస్యని లేవనెత్తలేదని 2008 నుంచి ఈ పర్సెంటేజ్ విధానం కోసం పోరాడుతున్నామని గుర్తుచేశారు. “హరిహర వీరమల్లు సినిమా సమయంలోనే ఈ డిమాండ్ పెట్టాం. అప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు ‘పెద్ది’ సినిమా కోసం వివాదం చేస్తున్నామనడం హాస్యాస్పదం. సమస్య పరిష్కారం కాకపోవడం వల్లే మళ్ళీ మా వాయిస్ రైజ్ చేస్తున్నాం.ఒకప్పుడు తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్లు ఉండేవి,కాని ఇప్పుడు అవి 400కి పడిపోయాయి. ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో అసలు సింగిల్ స్క్రీన్స్ అనేవే ఉండవు అంటూ అని మనసులోని ఆవేదనని బయట పెట్టారు.
also read :రామ్ పోతినేని ‘ఓవర్’ కాన్ఫిడెన్స్.. హీరోగా ఫెయిల్ అయ్యి డైరెక్టర్‌గా సక్సెస్ అవుతాడా?
ఘాటుగా రియాక్ట్ అయిన అనుపమ్ రెడ్డి
ఇక ఈ సమావేశంలో పాల్గొన్న ఎగ్జిబిటర్ అనుపమ్ రెడ్డి ప్రొడ్యూసర్స్ చేసిన కామెంట్స్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో పర్సనల్ గా విమర్శించడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. లీజుదారుల గురించి మాట్లాడుతున్న ప్రొడ్యూసర్లు , అసలు థియేటర్ ఓనర్ల పరిస్థితి ఏంటో ఆలోచించడం లేదని ఫైర్ అయ్యారు.”నిర్మాతలు వాస్తవాలను పక్కన పెట్టి రాంగ్ డైరెక్షన్‌లో మాట్లాడుతున్నారు. సింగిల్ స్క్రీన్స్ అన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. మాకు పర్సెంటేజ్ విధానం అమలు చేస్తేనే మేము బతకగలం. లీజుదారులు కూడా బిజినెస్ మెన్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని స్పష్టం చేశారు ఎగ్జిబిటర్ అనుపమ్ రెడ్డి.
6 నెలల పాటు థియేటర్లు క్లోజ్
ఇక ప్రముఖ దేవి థియేటర్ ఓనర్ బాలగోవింద్ చేసిన కామెంట్స్ ఇపుడు మరింత సెన్సేషన్ అవుతున్నాయి.గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో హెల్తీ ఎట్మాస్పియర్ ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని ఆవేదన చెందారు. “వరుసగా పెద్ద సినిమాలు వస్తున్నాయని చెప్పి మా పీక నొక్కుతున్నారు. ‘నెక్స్ట్ సినిమా నుంచి చూద్దాం’ అంటూ పోస్ట్ పోన్ చేయడం ప్రొడ్యూసర్స్ కి అలవాటు అయిందని, మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే 6 నెలల పాటు థియేటర్లు క్లోజ్ చేయడానికైనా వెనుకడుగు వేయము,కానీ మేము థియేటర్లు క్లోజ్ చేస్తామనట్లేదని, కేవలం మల్టీప్లెక్స్‌లకు ఇచ్చే పర్సెంటేజ్ మాకూ ఇవ్వమని అడుగుతున్నాం” అంటూ కుండబద్దలు కొట్టారు.
ఏది తగ్గుతుందో..ఏది నెగ్గుతుందో
వాస్తవానికి సింగిల్ స్క్రీన్‌లకు వస్తున్న ఆదాయం మల్టీప్లెక్స్‌లతో పోలిస్తే చాలా తక్కువని, మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోతున్నాయని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు.ఇప్పటికైనా బడా నిర్మాతలు ఇలా టైమ్ పాస్ చేయకుండా చర్చలకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా జూన్ 4న పెద్ది రాబోతున్న ఈ సమయంలో ఎగ్జిబిటర్ల వార్నింగులు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టెన్షన్ పుట్టిస్తున్నయనే చెప్పాలి. చూడాలి మరి ఈ రెండు వర్గాల్లో ఏది తగ్గుతుందో..ఏది నెగ్గుతుందో !
also read :యూట్యూబ్‌లో 3 కోట్లు.. రియాలిటీలో సున్నా! నెట్టింట వైరల్ అవుతున్న రాజశేఖర్ పంచ్‌లు