E-Paper
Advertisement

యూట్యూబ్‌లో 3 కోట్లు.. రియాలిటీలో సున్నా! నెట్టింట వైరల్ అవుతున్న రాజశేఖర్ పంచ్‌లు

యూట్యూబ్‌లో 3 కోట్లు.. రియాలిటీలో సున్నా! నెట్టింట వైరల్ అవుతున్న రాజశేఖర్ పంచ్‌లు
Advertisement

Rajasekhar Rumours : గోటీల ఫ్యాక్టరీ ఉందని ఎవరు నెట్టింట సర్క్యులేట్ చేశారో కాని నాకెలాంటి ఫ్యాక్టరీ లేదురా మొర్రో అని అందరికి చెప్పలేక జుట్టు పీక్కుంటున్నాడు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ .విషయం ఏంటంటే ..ఆయనకు ఒక “గోటీల ఫ్యాక్టరీ” (Marbles Factory) ఉందని, దాని ద్వారా ఆయన బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇండియా వంటి దేశాల్లో వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారనేది ఆ రూమర్స్ వెనుకున్న కథ.ఇక సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతంగా వైరల్ అయిపొయింది కూడా.దీంతో అదేమీ లేదంటూ అసలు విషయం చెప్పినా మేము నమ్మం.మీకు గోటీల ఫ్యాక్టరీ ఉంది పైగా సాలిడ్ ఇన్కం వస్తుంది కూడా.. అంటూ ఎవరికి వారు కథలు కథలుగా అల్లెసుకుంటున్నారు .ఇక అసలు విషయం ఎవరూ నమ్మరంటూ ఈ వార్తలపై రాజశేఖర్ కూడా అవును ఉందంటూ కామెడీ చేయాల్సిన పరిస్థితి.

గోటీల ఫ్యాక్టరీ  ద్వారా నెలకు  3 కోట్ల ఆదాయం

Advertisement

ఈ క్రమంలోనే తాజాగా ఒక టీవీలో జరిగే పాపులర్ డ్యాన్స్ షోలో రాజశేఖర్-జీవిత దంపతులు చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు.రాజశేఖర్ ని సుధీర్ పిలవగా స్టేజ్ పైకి వచ్చిన రాజశేఖర్ ని చూసి రాజశేఖర్‌కు డ్యాన్స్ అంటే చాలు.. జ్వరం వచ్చేస్తుంది” అంటూ ఆటపట్టించింది సీనియర్ నటి రాధిక.దానికి రాజశేఖర్ రియాక్ట్ అవుతూ “అవును రాధికా.. అప్పట్లో డ్యాన్స్ అంటే భయపడేవాడిని, కానీ ఇప్పుడు అలవాటైపోయింది. పైగా ఇప్పుడు నేను చాలా బిజీ అయిపోయాను. రోజూ ఫ్యాక్టరీకి వెళ్లాలి కదా! నాకు గోటీల ఫ్యాక్టరీ ఉందని యూట్యూబ్‌లో చూశాను. దాని ద్వారా నెలకు రూ. 3 కోట్ల ఆదాయం వస్తుందట. కానీ సమస్య ఏంటంటే.. ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో నాకే తెలియదు. ప్రస్తుతం దాని కోసమే వెతుకుతున్నాను”అంటూ అదిరిపోయే కౌంటర్ వేశారు.ఇక రాజశేఖర్ అలా పంచ్ వేశాడో లేదో రాధిక, సుధీర్‌తో పాటు అక్కడున్న వాళ్ళంతా కడుపుబ్బా నవ్వేసుకున్నారు.

also read :మైత్రీ వర్సెస్ దిల్ రాజు కోల్డ్ వార్.. బలైపోతున్నది ‘పెద్ది’ సినిమానేనా?

Advertisement

‘శేఖర్’ సినిమా నుంచే మొదలు 

నిజానికి ఈ గాసిప్స్ ఆయన నటించిన ‘శేఖర్’ సినిమా  నుంచే మొదలైందని చెప్పాలి. అయితే ఇటీవల విడుదలైన ‘బైకర్’ (మనమే) సినిమా ప్రమోషన్లలో ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ ఒక పవర్‌ఫుల్ తండ్రి పాత్రతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సాలిడ్ గా మొదలెట్టేశారు. ‘మగమహారాజు’, ‘అంకుశం’, ‘ఆహుతి’ వంటి సినిమాలతో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజశేఖర్, ఇప్పుడు తన ఏజ్ కి తగ్గ పాత్రలతో దూసుకుపోతున్నాడు.

ఎంజాయ్ చేస్తున్న రాజశేఖర్

వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాజశేఖర్, త్వరలో పవన్ సాదినేని దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో ‘గరుడ వేగ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజశేఖర్ అదే తరహాలో ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లేదా యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఏది ఏమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ని సీరియస్ గా తీసుకోకుండా పాజిటివ్ గా ఎంజాయ్ చేస్తున్న రాజశేఖర్ ని మెచ్చుకుని తీరాల్సిందే!

also read :బన్నీతో పూజా హెగ్డే హ్యాట్రిక్.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ అప్‌డేట్!

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×