E-Paper
Advertisement

Film Chamber: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పంచాయితీ… రంగంలోకి సీనియర్ నిర్మాతలు ?

Film Chamber: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పంచాయితీ… రంగంలోకి సీనియర్ నిర్మాతలు ?
Advertisement

Telugu Film Chamber Election: ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల పంచాయితీ రోజు రోజుకి తీవ్రం అవుతుంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్ జరిపించాలని ఓ వర్గం అంటుంది. మరో వర్గం… ఇప్పుడు ఉన్న కార్యవర్గాన్నే కంటీన్యూ చేయాలని డిమాండ్ చేస్తుంది. దీనికి ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడింట్ సపొర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడున్న కార్యవర్గం కంటీన్యూ అవుతే… మళ్లీ అతనే ప్రెసిడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అలాంటి డిమాండ్ చేస్తున్నాడు అనే ఆరోపణలు ఆయనపై వస్తున్నాయి.

అసలేం జరిగిందంటే ?

Advertisement

ఫల్మ్‌ ఛాంబర్‌ ఎన్నిక జరగకుండ ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంటే.. మరో వర్గం మాత్రం ఎన్నికలు జరిపి సంస్కరణలు చేపట్టాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుత పాలక మండలి ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయించాలని చూస్తోంది. దీని వెనక అనేక వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని రెండోవర్గం ఆరోపణ. ఇప్పటి వరకు జరిగిన ప్రతి జనరల్ బాడీ సమావేశంలో ఈ ఎలక్షన్స్ గురించి చర్చ వచ్చింది. కానీ, ఇంత వరకు ఎలక్షన్స్ జరగలేదు. అనవాయితీగా జరగాల్సిన ఎన్నికలను పక్కా ప్లానింగ్ ప్రకారమే.. కొంత మంది సొంత లాభాల కోసమే వాయిదా వేస్తున్నారు అనే మాటలు ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ లోనే కాదు… సినిమా ఇండస్ట్రీలో కూడా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల వాయిదా వెనుక ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఉన్నాడని అందరి నోట నుంచి వచ్చే మాట.

ఈ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాతే ఈ గొడవలన్నీ…

అంతే కాదు… ఇప్పుడున్న ప్రెసిడెంట్ మరికొన్ని సంచలన ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకన్న తర్వాత ఛాంబర్‌లో చాలా మార్పులు జరిగాయని.. ఆయన వాళ్ల లేని సమస్యలు కూడా వచ్చాయని కూడా అనే వాళ్లు ఉన్నారు. ప్రెసిడింట్ బాధ్యతలను సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాడు అనే మాటలు కూడా వస్తున్నాయి.

ఛాంబర్ బిల్డింగ్ & చిత్రపురి బిల్డింగ్ ఇష్యూ…

Advertisement

మొన్న ఈ మధ్య జరిగిన సినీ కార్మికుల సమ్మె నుంచి మొదలుపెడితే… ఇంకా చాలా సమస్యలు ఈ ప్రెసిడెంట్ వల్లే అనే టాక్ చాలా రోజుల నుంచి ఉంది. అలాగే, ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ ను కూల్చేయ్యాలి అనే ప్రతిపాదన తీసుకురావడాన్ని కూడా చాలా మంది వ్యతిరేకించారు… వ్యతిరేకిస్తున్నారు. అలాగే చిత్రపురి బిల్డింగ్స్ ఇష్యూ గురించి అందరికీ తెలిసిందే. ఇన్ని సమస్యల మధ్య… మళ్లీ అతనే ప్రెసిడింట్ అవ్వాలని చూడటం ఎంత వరకు సమంజసం అని అంటున్నారు.

దురుద్దేశంతోనే జనరల్ బాడీ మీటింగ్‌కు అడ్డంకులు ?

నిజానికి రేపు అంటే.. అక్టోబర్ 26న ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే… సడన్‌గా పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయి. ఆ నోటీసుల్లో ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ సమావేశానికి 4,979 మంది హాజరవుతున్నారని, అంత మందికి తాము బందోబస్తు ఇవ్వలేమని చెబుతూ పోలీసు వాళ్లు ఆ జనరల్ బాడీ మీటింగ్ ను క్యాన్సిల్ చేశారు. కానీ, ప్రతి జనరల్ బాడీ సమావేశానికి వచ్చేది 100 నుంచి 150 మంది మాత్రమే. అయితే పోలీసులు వాళ్లు 5000 మంది వరకు మెన్షన్ చేయడం వెనక ఎవరిదో ఒకరిది హస్తం ఉంది అనే చర్చ ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ లో జరుగుతుంది. రేపు జరగబోయే జనరల్ బాడీ సమావేశంలో ఛాంబర్ ఎన్నికలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు… జనరల్ బాడీ సమావేశమే జరగడం లేదు. ఇప్పుడీ జనరల్ బాడీ సమావేశాన్ని ఎవరు ఆపాలని ట్రై చేస్తున్నారు అంటూ ఆలోచిస్తున్నారు.

సీనియర్ నిర్మాతల ఎంట్రీ ?

మొదటిసారి ఛాంబర్‌ ఎన్నికల విషయంలో జరుగుతున్న అవకతవక వల్ల పెద్ద నిర్మాతలైన సురేష్‌ బాబు, అల్లు అరవింద్‌, కేఎస్‌ రామారావులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఎన్నికలు జరగకుండ అడ్డుకుంటున్న ప్రస్తుత అధ్యక్షుడి తీరుపై వారు తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. . దీంతో ఈ వివచ్చే నెల జరిగే జనరల్‌ బాడీ మీటింగ్‌కి వారంత హాజరై ఛాంబర్‌ని తమ చేతిలోకి తీసుకుని కొత్త కార్యనిర్వహన వర్గాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. కాగా ప్రస్తుత ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యవర్గం గడువు జూలై 31నే ముగిసింది. గడువు ముగియకముందే ఎన్నికలు జరిగి.. కొత్త సంస్కరణలు రావాలి. నిబంధనల ప్రకారం పాత కార్యవర్గం అధ్యక్ష పదవిలో కొనసాగడానికి వీలు లేదు. కానీ, ప్రస్తుతం అధ్యక్షుడు తమ స్వలాభం కోసం ఎన్నికలు జరగకుండ చూస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×