E-Paper
Advertisement

Naa Anveshana: ఆస్ట్రేలియాలో నా అన్వేషణ పై కేసు నమోదు.. విదేశాలలోనూ మొదలైన వ్యతిరేకత!

Naa Anveshana: ఆస్ట్రేలియాలో నా అన్వేషణ పై కేసు నమోదు.. విదేశాలలోనూ మొదలైన వ్యతిరేకత!
Advertisement

Naa Anveshana: ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శివాజీ వివాదాస్పద వ్యాఖ్యల పై అన్వేషణ స్పందిస్తూ గరికపాటి గురించి కూడా మాట్లాడటమే కాకుండా హిందూ దేవతల గురించి అవమానకరంగా మాట్లాడుతూ వీడియోలను విడుదల చేశారు. దీంతో అన్వేషణ కూడా వివాదంలో చిక్కుకున్నారు. అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఇండియాలో హిందువుల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. హిందువుల గురించి హిందూ దేవతల గురించి అవమానకరంగా మాట్లాడటంతో 10 లక్షలకు పైగా ఈయనని హిందువులు అన్ ఫాలో చేశారు.

ఆస్ట్రేలియాలో అన్వేష్ పై కేసు…

ఈ నేపథ్యంలోనే అన్వేష్ స్పందిస్తూ తాను ఎప్పుడూ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేదు వాళ్లే వచ్చారు వాళ్లే వెళ్లిపోయారు నేను ఇలాంటి వాటికి భయపడనని తెలిపారు.. అంతేకాకుండా నేను బ్రహ్మ దేవుడిని నన్నెవరూ ఏం చేయలేరు అంటూ కూడా ఇటీవల మరొక వీడియోను విడుదల చేశారు. ఇండియాలోకి తాను అడుగు పెట్టను అంటూ అన్వేషణ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల విదేశాలలో కూడా వ్యతిరేకత తలెత్తుతోంది. తాజాగా అన్వేష్ పై ఆస్ట్రేలియాలో(Australia) కేసు నమోదు చేయడం సంచలనగా మారింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు అన్వేషణ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆయనపై స్థానిక పోలీసులను కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.

వీసా రద్దు చేయాలి..

Advertisement

భారతీయ సాంప్రదాయాలను హిందూ దేవతలను కించపరిచేలా అన్వేష్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆయన ఇకపై ఆస్ట్రేలియాలోకి అడుగుపెట్టకుండా తన వీసా రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను భారతీయులు కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్వేష్ వ్యవహారంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టే ఇలాంటి వ్యక్తులు ఏ దేశంలోనూ అడుగు పెట్టకుండా చేయాలని విదేశాలలో నివసిస్తున్న భారతీయులు కూడా అన్వేష్ తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు.
సొంత దేశంలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఇతడికి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈయన పతనం మొదలైందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ఇక అన్వేష్ కేవలం తన యూట్యూబ్ ఛానల్ కోసమే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ తనపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే తనకు వ్యూస్ తగ్గిపోతాయో ఆ సమయంలో ఇలాంటి వివాదాస్పద కంటెంట్ ద్వారా రంగంలోకి దిగుతారు. ఈ నేపథ్యంలోనే శివాజీ చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన అన్వేష్ ఆలోచన బెడిసి కొట్టింది .దీంతో ఈయనకు వ్యూస్ రావడం పక్కన పెడితే భారీగా సబ్స్క్రైబర్లు అన్ ఫాలో చేస్తూ షాక్ ఇవ్వడమే కాకుండా ఈయనపై ఇండియాలో, విదేశాలలో కూడా వ్యతిరేకత ఏర్పడి కేసులు నమోదు కావటం గమనార్హం.

Also Read: Big tv kissik talks: ఆయన పరిచయం నా జీవితాన్ని మార్చేసింది..: హైపర్ ఆది

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×