E-Paper
Advertisement

Big tv kissik talks: ఆయన పరిచయం నా జీవితాన్ని మార్చేసింది..: హైపర్ ఆది

Big tv kissik talks: ఆయన పరిచయం నా జీవితాన్ని మార్చేసింది..: హైపర్ ఆది
Advertisement

Big tv kissik talks: హైపర్ ఆది టాలీవుడ్ కమెడియన్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. హైపర్ ఆది (Hyper Aadi)కామెడీ టైమింగ్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇలా కమెడియన్ గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న ఆది ప్రస్తుతం బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే గతంలో పలు సందర్భాలలో ఆది తన తండ్రి పొలం అమ్మి చదివించారు అంటూ పలు విషయాలను వెల్లడించారు అయితే తాజాగా ఈ విషయం గురించి ఆది మాట్లాడుతూ..

పొలం అమ్మి అప్పులు తీర్చాం..

తాము ముగ్గురం అన్నదమ్ములమని తెలిపారు. మమ్మల్ని చదివించడం కోసం నాన్న సుమారు 20 లక్షల వరకు అప్పు చేశారని ఆ అప్పు తీర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డామని తెలిపారు. అన్న వాళ్ళిద్దరు చదువులు అయిపోయిన జాబ్ రాలేదు. ఇక నేను కూడా అప్పుడప్పుడే చదువు పూర్తి చేసుకుని చిన్న జాబ్ తెచ్చుకున్నాను దీంతో తన ఫ్యామిలీ మొత్తం తన పైన చాలా హోప్స్ పెట్టుకున్నారని తెలిపారు. నాకు వచ్చే పదిహేను వేలు వడ్డీ కట్టడానికి కూడా సరిపోయేది కాదని అది తెలిపారు. ఇలా అప్పు తీర్చడం ఎలా అంటూ ఆలోచించి తనకున్న మూడు ఎకరాల పొలం అమ్మేసి అప్పులు మొత్తం తీర్చేశానని ఆది తెలిపారు.

ఉద్యోగం చేయడం నచ్చలేదు..

Advertisement

ఇలా అప్పు పూర్తి అయిన తర్వాత హైదరాబాద్లో తనకు తెలిసిన బంధువుల హాస్టల్ లో ఉండి జాబ్ చేశాను. కానీ నాకు ఆ జాబ్ ఏ మాత్రం నచ్చలేదని అందుకే జాబ్ రిజైన్ చేశానని అది తెలిపారు .ఇలా నేను జాబ్ రిజైన్ చేయడంతో మా ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడ్డారు. ఆ సమయంలోనే అదిరే అభి అన్న నా వీడియోలు చూసి నాకు మెసేజ్ చేసి జబర్దస్త్ లో అవకాశం కల్పించారు. ఇక జబర్దస్త్ షోలో నేను ఏదో రిక్షా తోసుకుంటూ కనిపించడంతో నాన్న వాళ్ళు చాలా బాధపడ్డారు ఊర్లో అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారని బాధపడ్డారు.. కానీ నన్ను నేను నమ్ముకుని నాలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ తక్కువ సమయంలోనే సక్సెస్ అయ్యానని ఆది తెలిపారు.

Advertisement

ఇలా జబర్దస్త్ ద్వారా మంచి సక్సెస్ అయిన తర్వాత నేను ఎంత పొలం అయితే అమ్మానో అంత పొలం కొనుక్కున్నానని నాన్న వాళ్లకు ఒక ఇల్లు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశానని తెలిపారు. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం అభి అన్న అని, నా జీవితాన్ని మార్చేసిన అభి అన్నకు జీవింతాం రుణపడి ఉంటానని ఆయన రుణం తీర్చుకోలేనిది అంటూ అది ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక నాకంటూ పెద్దగా ఏమీ ఆశలు పెట్టుకోలేదు నేను కష్టపడేది మొత్తం నా కుటుంబం కోసమేనని అది తెలియజేశారు. నాకు ఉండడానికి ఒక గది, చిన్న టీవీ ఉంటే చాలని, నేను రేపటి కోసం కాకుండా ఆరోజు సంతోషంగా బ్రతకడం కోసమే కష్టపడతానని ఆది ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read: Big tv kissik talks: అంతకంటే గొప్ప ప్రశంస ఏదీ లేదు.. నాగబాబుపై ఆది కామెంట్స్!

Related News

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×