Revenue Sharing Model : తమిళ చిత్ర నిర్మాణ మండలి ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా కొత్త పద్ధతులను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఇప్పుడు కూడా రెవిన్యూ షేరింగ్ మోడల్ పద్ధతిని తీసుకొచ్చింది. ఇప్పటికే దీనిపై ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు నిర్మాణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వచ్చే నెల 2 నుంచి ఇండస్ట్రీలో ఎటువంటి షూటింగ్ లు జరగడానికి వీళ్లేదని నిర్ణయించింది. కేవలం షూటింగ్‌ల నిలిపివేత మాత్రమే కాకుండా, సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు అత్యంత కఠినమైన నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇది కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తమిళ నిర్మాత మండలి నిర్ణయం ఏంటి అనేది మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
తమిళ చిత్ర నిర్మాత మండలి కొత్త సంస్కరణను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. నటీనటులకు సినిమా ప్రారంభంలోనే భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చే పద్ధతికి స్వస్తి పలకాలని నిర్మాతలు భావిస్తున్నారు.. అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడం కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన పెట్టుబడిలో వాటా షేరింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇలా అయితే నిర్మాతలకు నష్టాలు తప్పే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం పై ఇప్పటికే ఇండస్ట్రీలోని స్టార్స్ మధ్య చర్చలు జరిగాయి. ఒకవేళ నటీనటులు ఈ పద్ధతికి గనక ఒప్పుకోకపోతే మే రెండు నుంచి ఇండస్ట్రీలో ఎటువంటి షూటింగ్ లు జరగవు అని నిర్మాతల మండలి తేల్చి చెప్పేసింది.
ఇకమీదట ఇండస్ట్రీలో సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా భారీ పారితోషికం తీసుకోవడం కుదరదు.. నిర్మాతతో పాటు నటీనటులు కూడా లాభనష్టాలను పంచుకోవాల్సి ఉంటుందని నిర్ణయించింది. అంతేకాదు దీనిపై అవగాహన కోసం మే 2న ఒక రోజు సమ్మెను కూడా ప్రకటించారు. ఒకవేళ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ నిర్ణయానికి సహకరించకపోతే ఈ సమ్మె మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. అలాగే, థియేటర్లలో విడుదలైన సినిమాలను ఓటీటీలో విడుదల చేసే విషయంలో కూడా నిబంధనలు కఠినతరం చేశారు. చిన్న సినిమాలకు 6 వారాలు, భారీ బడ్జెట్ సినిమాలకు కనీసం 8 వారాల గడువు తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గుతుందని మండలి భావిస్తోంది.. మరి నిర్మాత మండలి నిర్ణయం పై నటీనటుల స్పందన ఎలా ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది..
Also Read :ప్రేమ అవుట్.. కొత్త హీరోయిన్ ఎంట్రీ.. బ్యాగ్రౌండ్ ఇదే..?
ఒక సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్ అయిన అవ్వకపోయినా బడ్జెట్ను బట్టి వాళ్ళకి రెమ్యూనరేషన్ కోట్లల్లోనే ఉంటుంది.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలలో నటించే నటీనటులకు పారితోషికం ఎక్కువ.. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా కానీ రెమ్యూనరేషన్ విషయంలో యాక్టర్స్ నో కాంప్రమైజ్ అని అంటున్నారు. దానివల్ల చాలామంది నిర్మాతలు నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇలా నిర్మాతలు నష్టపోకుండా ఉండడానికి తమిళ చిత్ర నిర్మాతల మండలి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి దీనిపై ఇండస్ట్రీలో ఎలాంటి చర్చలు మొదలవుతాయి అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..