Romantic Movie OTT : కొన్ని సినిమాలు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటాయి. ఒక్కో సారి అది కూడా సినిమాకు లాభమే అవుతుంది. జనాల్లో ఈ సినిమా బాగా వెళ్తుంది. అయితే ఇళయరాజా సంగీతం అందించిన ఒక బోల్డ్ మూవీ వివాదాలతో హోరెత్తింది. ఈ సినిమాలోని అడల్ట్ కంటెంట్, వివాదాస్పద సీన్ల వల్ల సెన్సార్ బోర్డుతో చాలా కాలం వివాదాలు నడిచాయి. చివరికి దీని రిలీజ్ కోసం కోర్ట్ లో ఇదేళ్లు పోరాటం చేశారు దర్శకుడు. రిలీజ్ అయ్యాక మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కూడా. కమర్షియల్ గా సినిమా బాగానే ఆడినప్పటికీ, ఇది కేవలం ఒక మసాలా చిత్రంగా నిలిచిపోయింది. అయితే దీనికి ఐయండిబిలో 7.2 రేటింగ్ ఉండటం విశేషం.
వేలు ప్రభాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ రొమాంటిక్ డ్రామా పేరు ‘కాదల్ కథై’ (Kadhal Kadhai). ఈ సినిమా ప్రధానంగా సెన్సార్ వివాదాల వల్ల వార్తల్లో నిలిచింది. ఇందులో ఉన్న బూతు కంటెంట్ కారణంగా సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో, దర్శకుడు వేలు ప్రభాకరన్ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత, సుప్రీం కోర్టు జోక్యంతో ఈ సినిమాకి లైన్ క్లియర్ అయ్యింది. చివరకు 2009లో ఇది విడుదల అయ్యింది. అందుకే ఈ సినిమా కథలో ఒక భాగంగా దర్శకుడు తను పడ్డ ఈ ఇబ్బందులను కూడా ఒక ట్రాక్ లాగా జోడించి, ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన సంగీతం ఒక పెద్ద ఎసెట్. అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా అయినప్పటికీ, ఆయన తన నేపథ్య సంగీతంతో సినిమాకి హైప్ తీసుకొచ్చారు. జె. సతీష్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో బాబిలోనా, షెర్లీ దాస్ వంటి నటులు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ (Youtube)లో అందుబాటులో ఉంది.
ఈ సినిమాలో ముగ్గురు ఆడవాళ్ల జీవితాలను చూపిస్తారు. వీళ్లందరికీ పెళ్లయినా, తమ మొగుళ్ల వల్లనో, ప్రేమికుల వల్లనో సరైన సుఖం దొరకదు. దీనివల్ల వాళ్లు బయట వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకుంటారు. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం ఒక పక్క ఉన్నా, తమ మనసులోని కోరికలను అణచుకోలేక తప్పుదోవ పడుతుంటారు. ఇందులో కేవలం వాళ్ల కథలే కాకుండా.. ఈ సినిమా తీస్తున్న డైరెక్టర్ (వేలు ప్రభాకరన్) పడే కష్టాలను కూడా చూపిస్తారు. ఇట్లాంటి బోల్డ్ కథతో సినిమా తీయాలని ఆయన ప్రయత్నిస్తుంటే, ప్రజల నుంచి,సెన్సార్ బోర్డు నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చాయి అనేది ఒక ట్రాక్ లాగా నడుస్తుంది. ఈ సినిమా అంతా కూడా కోరికల మధ్య జరిగే పోరాటం లాగా ఉంటుంది. ప్రేమ, కామం, మోసం అనే కోణాల్లో మనుషులు ఎలా ప్రవర్తిస్తారు అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్.
Read Also : అన్నయ్యనే ప్రేమికుడిగా ఊహించుకునే టీనేజ్ గర్ల్… క్రేజీగా సాగే ఎమోషనల్ జర్నీ