E-Paper
Advertisement

Free Adobe Express Premium: ఎయిర్‌టెల్ యూజర్లకు రూ.4,000 సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ.. ఎలా పొందాలో చూసేయండి!

Free Adobe Express Premium: ఎయిర్‌టెల్ యూజర్లకు రూ.4,000 సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ.. ఎలా పొందాలో చూసేయండి!
Advertisement

Free Adobe Express Premium: మీరు ఎయిర్‌టెల్ వినియోగదారులా? అయితే మీకొక అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్, సాఫ్ట్‌వేర్ దిగ్గజం అడోబ్‌తో జతకట్టి తమ కస్టమర్ల కోసం ఓ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. సుమారు 360 మిలియన్ల మంది ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు ఇప్పుడు Adobe Express Premium సేవలను ఏడాది పాటు ఉచితంగా పొందొచ్చు. అదెలాగో తెలుసుకుందాం పదండి..

క్రియేటర్లకు బంపర్ ఆఫర్..

సాధారణంగా అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం ఏడాదికి రూ.4వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, భారత్‌లో పెరుగుతున్న క్రియేటర్ ఎకానమీని దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌టెల్ ఈ సేవలను తన యూజర్లకు ఫ్రీగా అందిస్తోంది. దీంతో సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, చిరు వ్యాపారస్తులు, స్టూడెంట్స్‌కు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. గ్రాఫిక్ డిజైనింగ్‌లో పెద్దగా అనుభవం లేకపోయినా సరే.. ఈ టూల్ ఉపయోగించి హై క్వాలిటీ వీడియోలు, పోస్టర్లు, ఫొటోలను క్రియేట్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: మీ ఫోన్‌ను దొంగిలించారా? ఇక ఆ దొంగకే రిస్క్.. గూగుల్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇదే!

జనరేట్ చేయడం సులభం..

ఈ ఆఫర్ ద్వారా యూజర్లు వేల సంఖ్యలో డిజైన్ టెంప్లేట్లను యాక్సెస్ చేయొచ్చు. ముఖ్యంగా భారతీయ పండుగలు, పెళ్లిళ్లు, స్థానిక వ్యాపారాలకు తగినట్లు దీని ప్రత్యేక డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే దీనిలో ఉండే AI ఫీచర్ల ద్వారా ఒక్క క్లిక్‌తో ఫొటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడం, వీడియో ఎడిటింగ్, కొత్త ఫొటోలను జనరేట్ చేయడం చాలా సులభం అవుతుంది. అంతేకాదు.. 100GB క్లౌడ్ స్టోరేజ్, ప్రీమియం ఫాంట్లు, అడోబ్ స్టాక్ అసెట్స్ కూడా వినియోగదారులకు లభిస్తాయి.

ఫ్రీగా ఎలా పొందాలంటే?

Advertisement

ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ మొబైల్, Wi-Fi, DTH కస్టమర్లందరికీ వర్తిస్తుంది. Airtel Thanks App ద్వారా ఈ ప్రయోజనాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి క్రెడిట్ కార్డ్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. డిజిటల్ రంగంలో రాణించాలనుకునే ప్రతి భారతీయుడికి ప్రపంచస్థాయి క్రియేటివ్ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకురావడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశమని ఎయిర్‌టెల్ ప్రతినిధులు తెలిపారు.

Also Read: రూ.35వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కావాలా? నథింగ్ ఫోన్ 4a ప్రో కోసం వెయిట్ చేయాల్సిందే మరి!

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×