E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 11th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు తమ మనవడేనన్న సుభాష్

Brahmamudi Serial Today Episode May 11th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు తమ మనవడేనన్న సుభాష్
Advertisement

Brahmamudi serial today Episode: అందరూ వెళ్లిపోయాక అపర్ణ, రాజును మీ అమ్మానాన్న పేరేంటి అని అడగ్గానే.. రాజు వర్జినల్ పేర్లు కాకుండా వేరే ఏదైనా పేర్లు చెప్పాలి అని ఆలోచిస్తుంటే.. ఇందు వెంటనే నాన్న చలపతి అమ్మ పేరు లక్ష్మీ తమ్ముడి పేరు వెంకటేశ్వర్లు అని చెప్తుంది. దీంతో రాజు కోపంగా ఇందు అనగానే.. ఏంటి మీ తమ్ముడి లాగే నీక్కూడా వెంకటేశ్వర్లు అనే పేరు నచ్చదా..? అని అడుగుతుంది. దీంతో అది కాదు ఇందు మా అమ్మా నాన్న పేర్లు వాళ్లకు ఎందుకు చెప్పావు అంటాడు రాజు. దీంతో ఇందు వాళ్లు అడిగారు కాబట్టి చెప్పాను అనగానే.. రాజు కోపంగా అయితే మా ఇల్లు పక్కవీధిలో ఉంది. మేము పెళ్లి రోజులు, బర్తుడేలు రిచ్‌ గా చేసుకోము చికెన్ వండుకుని మాత్రమే తింటామని మా ఇంటి గుట్టు మొత్తం బయటకు చెప్పేయ్‌ అంటుంటే..

అపర్ణ ఏంటి బాబు ఏమైంది..? ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతుంది. ఏం లేదండి.. ఈ సిటీలోనే ఉంటాము అంటాడు రాజు. ఇంతలో స్వాతి కలగజేసుకుని ఈ సిటీ అంటే ఎక్కడ బావ.. అనగానే.. పక్కనే ఉన్న బస్తీలో ఉంటాము అమ్మ అనగానే.. శేషు అనుమానంగా ఆ బస్తీ నీకు కంఫర్ట్‌ గా ఉంటుందా బాబు అని అడగ్గానే.. ఏం కఫర్ట్‌ మామయ్య అడ్జస్ట్‌ అవ్వాలి కదా అని రాజు చెప్పగానే.. శేషు కానీ అసలు నువ్వు మాత్రం అసలు మామూలు ట్విస్టు ఇవ్వలేదయ్యా.. ఈరోజు మా మైండ్‌ మొత్తం బ్లాక్‌ అయిపోయింది. ఇదిగో మా ఆవిడను తప్పించి ఇందునే పెళ్లి చేసుకున్నావు అంటే.. భ్రమరాంబ ఇప్పుడు అవన్నీ ఎందుకులే అంటూ వెళ్లిపోతుంది. శేషు వెనకాలే వెళ్లిపోతాడు. ఇందు, స్వాతి దగ్గరకు వెళ్లి స్వాతి ఇప్పుడు హ్యాపీయేనా అని అడగ్గానే.. పెళ్లి ఆగిపోయింది కదా హ్యాపీయే కానీ ఈ ట్విస్టే అర్థం కావడం లేదు అనగానే.. ఇందు నాన్నమ్మ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు.. సడెన్‌గా అలా జరిగిపోయింది. అని చెప్తుంటే..

Advertisement

రాజు మనసులో సడెన్‌ గా ఇలా జరిగిపోయింది అంటావేంటి..? నువ్వే కదా అంతా ప్లాన్‌ చేసింది.. అని మనసులో అనుకుంటాడు. ఇంతలో అపర్ణ బాబు ఇంతకీ మీ ఇంటి పేరేంటి..? అని అడగ్గానే.. అబ్బో ఇక్కడ ఇంకా చాలా సేపు ఉంటే.. పుట్టుపూర్వోత్తరాలు లాగేసేలా ఉన్నారు.. అని మనసులో అనుకుంటూ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం నేను ప్రెష్‌ అవుతాను అంటూ ఇందుతో పాటు రూంలోకి వెళ్తాడు. అపర్ణ ఆశ్చర్యంగా సుభాష్‌తో ఏవండి నాకు అసలు నమ్మబుద్ది కావడం లేదండి.. తనను చూస్తుంటే అచ్చం మన కొడుకును చూసినట్టు ఉంది అని చెప్తుంటే.. సుభాష్‌ కూడా నాకు అలాగే అనిపిస్తుంది అపర్ణ. ఒకవేళ నా అనుమానమే నిజం అయితే వాడు మన మనవడు అయ్యే అవకాశం ఉంది లేకపోతే అచ్చు గుద్దినట్టుగా మన రాజులా ఎందుకు ఉంటాడు అనగానే.. అపర్ణ కూడా అవునండి.. కచ్చితంగా వాడు మన కూతురు కొడుకే.. అది తెలియాలంటే తన అమ్మానాన్నలను కలిసి మాట్లాడాలి అప్పుడే మనకు నిజాలు తెలుస్తాయి అంటుంది. సుభాష్‌ అవును అంటాడు.

మరోవైపు రూంలోకి వెళ్లిన రేఖ కోపంగా రూంలో వస్తువులన్నీ చిందరవందర చేస్తుంటుంది. భూషణ్‌ ఆపేస్తాడు. రెండు తరాలుగా ఈ ఆస్థి కోసం ప్రయత్నిస్తున్నాము మా చేతికి అందకుండా పోతుంది అంటూ బాధపడుతుంది. భూషణ్‌, రేఖ వాళ్లిద్దరి పెళ్లిని క్యాన్సిల్‌ చేసి మదన్‌ తో పెళ్లి చేయడానికి ప్లాన్‌ చేస్తారు. ఇందు రూంలోకి వెళ్లిన రాజు ఆ రూం చూసి ఇది నీ రూమా..? నువ్వు ఈ ప్యాలెస్‌కు యువరాణివి ఈ స్టోర్‌ రూంలో ఉంటానంటే నమ్ముతానా అంటాడు. ఇందు కోపంగా ఏయ్‌ నేను ఉండేది ఈ గదిలోనే అని చెప్పగానే.. రాజు షాక్‌ అవుతాడు. ఈ రూంలో నువ్వు ఉంటున్నావా..? మోసం చేశావే.. నన్ను మోసం చేశావు.. ఇదో పెద్ద ప్యాలెస్‌, దీనికి నువ్వే యువరాణివి నాకు బాగా డబ్బులు ఇస్తావని అనుకుంటే ఇప్పుడు ఇలాంటి ట్విస్ట్‌ ఇస్తే ఎలా అంటూ కోప్పడుతుంటే.. ఇందు కోపంగా రాజును తిడుతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో ఇందు అప్పుడే నేను పెట్టిన కండీషన్స్‌ గుర్తు తెచ్చుకో అని చెప్పగానే.. రాజు ప్లాష్‌ బ్యాక్‌ గుర్తు చేసుకుంటాడు. ఇందు వెటకారంగా గుర్తుకు వచ్చిందా అని అడగ్గానే.. రాజు గుర్తుకు వచ్చింది అంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×