E-Paper
Advertisement

Thalapathy Vijay Jana Nayagan: విజయ్ కు మళ్లీ దెబ్బ.. ఇక చివరి సినిమా లేనట్టేనా..!

Thalapathy Vijay Jana Nayagan: విజయ్ కు మళ్లీ దెబ్బ.. ఇక చివరి సినిమా లేనట్టేనా..!
Advertisement

Thalapathy Vijay Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న జన నాయకన్ సినిమా మళ్లీ సమస్యల్లో పడింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు చాలా ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సినిమా రిలీజ్‌కు అడ్డంకి ఏర్పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ఈ సినిమా మొదటగా 2026 జనవరి 9న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే సెన్సార్ సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియలో మరో కొత్త సమస్య ఎదురైంది. సినిమాను సర్టిఫికెట్ ఇవ్వడానికి ముందు CBFC రివైజింగ్ కమిటీకి చూపించాల్సి ఉంటుంది. ఆ కమిటీకి మార్చి 9న మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్ పూర్తయితే త్వరలోనే సినిమాకు సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉందని భావించారు.

మళ్లీ మొదలైన కష్టాలు..!

Advertisement

కానీ అనుకోకుండా రివైజింగ్ కమిటీ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురయ్యారు. అందువల్ల ఈ స్క్రీనింగ్‌ను చివరి నిమిషంలో వాయిదా వేశారు. దీంతో సినిమా విడుదలపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.

నిర్మాతల సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ స్క్రీనింగ్‌ను మార్చి 17కి మార్చినట్లు తెలుస్తోంది. ఆ రోజు స్క్రీనింగ్ జరిగితే సెన్సార్ సర్టిఫికెట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

ఈ సినిమా సెన్సార్ సమస్యలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. నిర్మాతలు మొదటగా 2025 డిసెంబర్ 18న సినిమాను సెన్సార్ బోర్డుకు పంపించారు. ఆ తర్వాత ఎగ్జామినింగ్ కమిటీ కొన్ని మార్పులు సూచించింది. మొత్తం 14 కట్లు.. మార్పులు చేయాలని సూచించింది.

నిర్మాతలు ఆ మార్పులు చేసి మళ్లీ సర్టిఫికెట్ కోసం ఎదురుచూశారు. అయితే కమిటీలోని ఒక సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లింది. కొన్ని సన్నివేశాలు మత భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కూడా అభ్యంతరాలు వచ్చాయి.

ఈ విషయంపై నిర్మాతలు కోర్టును కూడా ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టులో ఈ కేసు కొంతకాలం సాగింది. చివరకు నిర్మాతలు కోర్టు మార్గాన్ని వదిలి రివైజింగ్ కమిటీ ద్వారా సర్టిఫికెట్ తీసుకోవాలని నిర్ణయించారు.

ఇక ఈ సినిమా విజయ్ కెరీర్‌లో చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి పూర్తిగా వెళ్లే ముందు చేస్తున్న చివరి సినిమా ఇదే అని చెబుతున్నారు. విజయ్ ఇప్పటికే తమిళగా వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో జన నాయకన్ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వరుసగా వస్తున్న సమస్యలు కారణంగా సినిమా విడుదల ఎప్పుడు జరుగుతుందో అన్న సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ALSO READ: Bhartha Mahasayulaku Wignyapthi OTT: ఫైనల్ గా ఓటీటీలోకి రానున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×