E-Paper
Advertisement

CSC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉంటే జాబ్ వచ్చేస్తది..!

CSC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉంటే జాబ్ వచ్చేస్తది..!
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం.. సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సర్వీస్‌ ఇండియా లిమిటెడ్ (CSC)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్.. టెన్త్, ఐటీఐ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సర్వీస్‌ ఇండియా లిమిటెడ్ (CSC), నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని కల్పించింది. వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్‌ సూపర్‌వైజర్‌/ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 252 ఖాళీలను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.

Advertisement

విద్యార్హత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుండి పదో తరగతి (SSC), ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి. కేవలం విద్యా అర్హతలే కాకుండా, సంబంధిత విభాగంలో వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటామని సంస్థ స్పష్టం చేసింది. ముఖ్యంగా కంప్యూటర్ పరిజ్ఞానం, ఆధార్ నమోదు ప్రక్రియపై అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.

Advertisement

వయస్సు:

దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన జిల్లా కేంద్రాల్లోని సీఎస్‌సీ కేంద్రాల ద్వారా ఆధార్ సేవలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ విధానం:

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, కెరీర్ విభాగంలో ఇచ్చిన లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తు సమయంలో విద్యార్హత పత్రాలు, వర్క్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 మార్చి 10.

ఆధార్ సేవల్లో భాగస్వాములు కావాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక చక్కని అవకాశం. గడువు ముగిసేలోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం సీఎస్‌సీ అధికారిక పోర్టల్‌ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://csc.gov.in/careers

ALSO READ: GITAM University: గీతం వర్సిటీపై వైసీపీ యుద్ధం.. ఎంపీ భరత్‌పై రూ. 5000 కోట్ల దోపిడీ ఆరోపణలు!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×